Vivo Y19s Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? వివో నుంచి సరికొత్త Y19s ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
Vivo Y19s Launch : కొత్తగా లాంచ్ అయిన వివో వై19ఎస్ డ్యూయల్ సిమ్ ఫోన్ (నానో+నానో), ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇంకా కంపెనీ ఆన్లైన్ స్టోర్లలో జాబితా చేయలేదు.

Vivo Y19s With Unisoc T612 SoC, 5,500mAh Battery Launched
Vivo Y19s Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త మోడల్ వై-సిరీస్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. సరికొత్త వివో వై19ఎస్ పేరుతో కంపెనీ లాంచ్ చేసింది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో పాటు ఆక్టా కోర్ యూనిసోక్ చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌తో అమర్చారు. 50ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. వివో వై19ఎస్ సంస్థ ఫన్‌టచ్ ఓఎస్ 14 ఇంటర్ఫేస్తో పాటు ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.
వివో వై19ఎస్ ధర ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇంకా కంపెనీ ఆన్లైన్ స్టోర్లలో జాబితా చేయలేదు. బంగ్లాదేశ్, యుఎఇ, రష్యా, వియత్నాం, మయన్మార్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, కంబోడియా, ఈజిప్ట్, థాయిలాండ్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లలో బ్లాక్, బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేసే ప్లాన్లపై వివో నుంచి ఎలాంటి సమాచారం లేదు.
వివో వై19ఎస్ స్పెసిఫికేషన్లు :
కొత్తగా లాంచ్ అయిన వివో వై19ఎస్ డ్యూయల్ సిమ్ ఫోన్ (నానో+నానో), ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుంది. 6.68-అంగుళాల హెచ్డీ+ (720×1,608 పిక్సెల్‌లు) ఎల్సీడీ స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్, పిక్సెల్ సాంద్రత 264పీపీఐ ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ 6జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 12ఎన్ఎమ్ ఆక్టా కోర్ యూనిసోక్ టీ612 చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
ఫోటోలు, వీడియోల కోసం వివో వై19ఎస్ 50ఎంపీ ప్రైమరీ కెమెరాను ఎఫ్/1.8 ఎపర్చరుతో పాటు ఎఫ్/3.0 ఎపర్చర్‌తో 0.08ఎంపీ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ స్క్రీన్‌పై హోల్ పంచ్ కటౌట్లో 5ఎంపీ కెమెరాతో వస్తుంది. వివో వై19ఎస్ ఫోన్ 128జీబీ ఇఎమ్ఎమ్సీ 5.1 స్టోరేజీతో అమర్చి ఉంది.
మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1టీబీ వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ యూఎస్బీ టైప్-సి పోర్ట్‌తో పాటు 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్ కనెక్టివిటీకి సపోర్టును అందిస్తుంది. బోర్డ్‌లోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, వర్చువల్ గైరోస్కోప్ ఉన్నాయి.
ఈ హ్యాండ్సెట్ 5,500mAh బ్యాటరీతో ఆధారితమైనది. ఛార్జింగ్ అడాప్టర్‌తో 15డబ్ల్యూ వద్ద ఛార్జ్ చేయవచ్చు. కంపెనీ ప్రకారం.. థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్‌లోని కస్టమర్లు బాక్స్‌లో ఛార్జర్‌ను పొందలేరు. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఈ ఫోన్ కొలతలు 165.75×76.10×8.10mm, బరువు 198గ్రాములు ఉంటుంది.
Read Also : Infinix Zero Flip Launch : ఇన్ఫినిక్స్ మడతబెట్టే ఫోన్ చూశారా? ఫీచర్లు భలే ఉన్నాయి.. ధర ఎంతంటే?