Voltas Discount on ACs : వోల్టాస్ ఎయిర్ కండీషన్లపై ఆఫ్-సీజన్ సేల్స్.. భారీ డిస్కౌంట్లు.. త్వరపడండి!
Voltas Discount on ACs : సమ్మర్ సీజన్‌లో ఏసీ ధరలు అమాంతం పెరిగిపోతుంటాయి. అప్పుడు ఆ సీజన్‌లో ఏసీలను కొనుగోలు చేయాలంటే అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఆఫ్ సీజన్ సమయంలోనే తక్కుధరకే ఏసీలను కొనుగోలు చేసుకోవచ్చు.

Voltas is offering Discount on ACs _ The Discount And Exchange Offers
Voltas Discount on ACs : సమ్మర్ సీజన్‌లో ఏసీ ధరలు అమాంతం పెరిగిపోతుంటాయి. అప్పుడు ఆ సీజన్‌లో ఏసీలను కొనుగోలు చేయాలంటే అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఆఫ్ సీజన్ సమయంలోనే తక్కుధరకే ఏసీలను కొనుగోలు చేసుకోవచ్చు. వినియోగదారుల కోసం వోల్టాస్ కంపెనీ కూడా తమ ఎయిర్ కండీషనర్లపై ఆఫ్ సీజన్ సేల్స్ ప్రారంభించింది. ఈ సేల్స్ కింద వినియోగదారులు అతి తక్కువ ధరకే ఏసీలను కొనుగోలు చేయొచ్చు. ఈ సీజన్‌లో ఏసీల వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. వినియోగదారులు ఏసీలను కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపరు.
అందుకే వోల్టాస్ కంపెనీ వినియోగదారులను ఆకర్షించేందుకు తమ ఏసీ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్‌లను అందిస్తోంది. మీరు కూడా ఎయిర్ కండిషనర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే తక్కువ ధరలో కావాలంటే ఇది సరైన సమయం. వోల్టాస్ తన “Azadi Mahotsav” ఆఫర్ కింద ఆఫ్ సీజన్ సేల్స్ ప్రకటించింది. దీని కింద వోల్టాస్, వోల్టాస్ బెకో ప్రొడక్టులపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఆగస్టు 21 వరకు సేల్ అందుబాటులో ఉండనుంది. కస్టమర్‌లు పెద్ద డిస్కౌంట్‌లతో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లను పొందవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై కూడా కంపెనీ క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది.

Voltas is offering Discount on ACs _ The Discount And Exchange Offers
మీరు కూడా ACని కొనుగోలు చేయాలనుకుంటే.. మంచి డీల్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. వోల్టాస్ సేల్ అందించే ACలపై మీకు నచ్చిన డీల్ ఎంపిక చేసుకుని కొనుగోలు చేయొచ్చు. వోల్టాస్ సేల్ ఆఫర్ వోల్టాస్ కొత్త సేల్ బదులుగా కొత్త స్ప్లిట్ ఏసీని కొనుగోలు చేసే కస్టమర్లకు డిస్కౌంట్లు, ఆఫర్‌లను అందిస్తోంది. ఈ ప్రత్యేక సేల్ సమయంలో వోల్టాస్, వోల్టాస్ బెకో ఐటెమ్‌లపై సేవింగ్స్ నుంచి కస్టమర్‌లు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ సేల్ మీకు ఆగస్టు 21 వరకు అందుబాటులో ఉంటుంది. వోల్టాస్ ప్రత్యేక ఛానెల్ షాప్‌లు, ప్రత్యేక బ్రాండ్ అవుట్‌లెట్‌లలో సేల్ అందుబాటులో ఉంది.
వోల్టాస్ కంపెనీ 5 ఏళ్ల సమగ్ర వారంటీతో పాటు Voltas,Voltas Beko ప్రొడక్టులపై మల్టీ ఫైనాన్స్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. అదనంగా, కంపెనీ NBFC ద్వారా సులభమైన EMI ఫైనాన్స్ ఆప్షన్లను కూడా అందిస్తోంది. వినియోగదారులు ఎవరైనా సులభమైన EMI ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇటీవలే ముగిసిన డిజిటల్ ఇండియా సేల్ కింద రిలయన్స్ డిజిటల్ కూడా ఏసీపై భారీ డిస్కౌంట్లను అందించింది. అందుబాటులో ఉన్న ప్రొడక్టులపై కంపెనీ 60 శాతం వరకు ఇచ్చింది. ఒకవేళ మీరు ఆఫ్-సీజన్ సేల్‌ను మిస్ అయితే.. వోల్టాస్, వోల్టాస్ బెకో ప్రొడక్టులపై వోల్టాస్ AC సేల్‌లో కొనుగోలు చేయొచ్చు.
Read Also : Best Inverter ACs : ప్రతినెలా కరెంట్ బిల్లును తగ్గించే.. రూ.35వేల లోపు బెస్ట్ ఇన్వెర్టర్ ఏసీలు ఇవే..