సెప్టెంబర్ 10న స్పెషల్ ఈవెంట్ : ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్ లాంచ్

ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ సిరీస్ రిలీజ్ కాకముందే ఎన్నో రుమర్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఐఫోన్ 11 సిరీస్ లాంచింగ్ ముందే ఎన్నో అంచనాలు.. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 11 సిరీస్ లాంచింగ్ డేట్ రానే వచ్చేసింది. ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. సెప్టెంబర్ 10న ఆపిల్ స్పెషల్ ఈవెంట్ జరుగనుంది. ఆపిల్ కొత్త జనరేషన్ ఐఫోన్లను కాలిఫోర్నియాలోని క్యూపర్టినో సిటీలో స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.00 గంటల ప్రాంతంలో అధికారికంగా లాంచ్ చేయనుంది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10.30గంటలకు లైవ్ ప్రారంభం కానుంది.
ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ టిమ్ కుక్ మొత్తం మూడు కొత్త ఐఫోన్లను రిలీజ్ చేయనున్నారు. అందులో ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్. ఈ మూడు ఐఫోన్లతో పాటు కంపెనీ ఆపిల్ వాచ్ సిరీస్, ఆపిల్ టీవీ ప్లస్, ఆపిల్ అర్కేడ్ సర్వీసుల అప్ గ్రేడ్ లను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది. ఆపిల్ కంపెనీ స్పెషల్ ఈవెంట్‌కు సంబంధించి యూట్యూబ్‌లో ఇప్పటికే లైవ్ స్ట్రీమింగ్ షెడ్యూల్ చేసింది. రాత్రి 10.30లకు స్పెషల్ ఈవెంట్ ప్రారంభమయ్యేలా షెడ్యూల్ సెట్ చేసింది. ఆపిల్ కంపెనీ లాంచింగ్ స్పెషల్ ఈవెంట్ యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
We are almost two weeks away from the official 2019 iPhone reveal ?
Most advanced iPhone camera ever is coming ???
Are you ready for it? pic.twitter.com/QWvf3CwPfT
— Ben Geskin (@BenGeskin) August 24, 2019
ఆపిల్ ఐఫోన్ 11 :
కొన్ని ఏళ్లుగా ఆపిల్ కంపెనీ తమ ఈవెంట్ లో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తు వస్తోంది. ఇదివరకే లేటెస్ట్ సిరీస్ ఫోన్లలో ఐఫోన్ ఎక్స్ ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ ఎస్ మోడల్స్ ప్రవేశపెట్టిన ఆపిల్.. ఐఫోన్ 11 సిరీస్ రిలీజ్ చేయబోతోంది. లీకైన సమాచారం ప్రకారం.. కొన్ని స్వల్ప మార్పులతో రెండు OLED ప్లస్, ఒక LCD మోడల్ ప్యాకేజీ ఉండే అవకాశం ఉంది.
ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లలో యూనిక్ స్వ్కెయిర్ కెమెరా మాడ్యుల్ ఉంటుందని అంచనా. ఈ కొత్త మాడ్యుల్‌లో మూడుకు పైగా సెన్సార్లు, వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంది. ఫాస్టర్ ఫేస్ ఐడీ, లేటెస్ట్ ఎ13 బయోనిక్ ప్రాసెసర్ కూడా ఉండనున్నాయి. రివర్స్ వైర్ లెస్ చార్జింగ్, ఆపిల్ పెన్సిల్ సపోర్ట్ కూడా ఒక మోడల్ ఉండనుంది.
ఫీచర్లు- స్పెషిఫికేషన్లు ఇవే
* 5.8 అంగుళాల OLED డిస్‌ప్లే (11 ప్రో)
* 6.5అంగుళాల OLED డిస్ ప్లే (11 ప్రో మ్యాక్స్)
* 6.1 అంగుళాల LCD స్ర్కీన్
* డ్యుయల్ రియర్ కెమెరాలు (బ్యాక్)
* ఆప్టికల్ జూమ్ ఎఫెక్ట్
* A13 బయోనిక్ చిప్ సెట్
* 512GB స్టోరేజీ
* 3,910mAh బ్యాటరీ
* 3,500mAh బ్యాటరీ
ఆపిల్ వాచ్ :
ఆపిల్ స్పెషల్ ఈవెంట్ లో కంపెనీ నుంచి రెండు కొత్త ప్రీమియం ఆపిల్ వాచ్ మోడల్స్ రిలీజ్ కానున్నాయి. అందులో ఒకటి సెరామిక్, టైటానియం. ఆపిల్ వాచ్ సిరీస్ 5 మాదిరిగా స్మార్ట్ వాచ్ ల్లో watchOS6 రన్ అవుతుంది. కొత్త బ్రాండ్ కలర్లను కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉంది.
హార్డ్ వేర్ అప్ గ్రేడ్ :
ఆపిల్ టీవీ హార్డ్ వేర్ లో కొత్త అప్ డేట్ రిలీజ్ చేయనుంది. ఈ కొత్త డివైజ్ ఫాస్టర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఆపిల్ ట్యాగ్ కూడా కంపెనీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. టైల్ బ్లూటూత్ ట్రాకింగ్ డివైజ్ మాదిరగా ఈ ట్యాగ్ పనిచేయనుంది. ఆపిల్ ట్యాగ్ ద్వారా లొకేషన్లను గుర్తించేందుకు యూజర్లకు అనుమతి ఇస్తుంది. లీకైన సమాచారం ప్రకారం.. iOS 13 కోడ్ రివీల్ చేసింది. Find my App అనే ఆప్షన్ ద్వారా ట్రాకింగ్ డివైజ్ కనిపెట్టవచ్చు.