రిలయన్స్ కొత్త సంచలనం.. జియో కాయిన్ లాంఛ్.. ఏంటిది? ఎందుకు? ఎలా వర్క్ చేస్తుంది? ఆల్ డిటెయిల్స్
జియో అందిస్తున్న స్పియర్ బ్రౌజర్ యూజర్లకు స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీకి చెందిన జియో ప్లాట్‌ఫాం అధికారికంగా జియోకాయిన్‌ను లాంఛ్ చేస్తూ వెబ్3, బ్లాక్‌చెయిన్ వ్యవస్థలోకి సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది. పాలిగాన్ ల్యాబ్స్ నెట్‌వర్క్ ద్వారా జియో ఇష్యూ చేసే డిజిటల్ టోకెనే జియోకాయిన్.
రిలయన్స్ జియోకు ఉన్న దాదాపు 450 మిలియన్ల మంది కస్టమర్ల కోసం బెంగళూరుకు చెందిన బ్లాక్‌చెయిన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ వెబ్3 సేవలను అందించనుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ సంస్థ పాలిగాన్‌తో జియో కలిసి ఈ కాయిన్ల జారీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీని ద్వారా గూగుల్ క్రోమ్‌తో పాటు బ్రేవ్ బ్రౌజర్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లాంటి వాటితో పోటీ పడాలని జియో అనుకుంటోంది. జియో స్పియర్ బ్రౌజర్ నుంచి ఇంటర్నెట్‌ను వాడే యూజర్లకు రివార్డు పాయింట్లుగా జియో కాయిన్లను ఇస్తారు.
ఎలా వాడాలి? ఉపయోగాలేంటి?
జియో అందిస్తున్న స్పియర్ బ్రౌజర్ యూజర్లకు స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటుంది. యూజర్ ఖాతాను క్రియేట్ చేసుకుని, లాగిన్ అయ్యి బ్రౌజర్‌ను వాడొచ్చు. ఇప్పటికే కొందరికి జియో కాయిన్లు అందాయి. ఆ కాయిన్లు పాలిగన్ సంస్థకు చెందిన వ్యాలెట్లలో సేవ్ అవుతాయి. వీటిని యూజర్లు రీడీమ్ చేయలేరు. అంతేగాక, ఈ కాయిన్లను ఇతరులకు పంపలేరు.
ఈ కాయిన్ రివార్డులతో కేవలం మొబైల్ రీఛార్జీ చేసుకోవడం, జియో ప్రొడక్టుల కొనుగోళ్లు, ఆ సంస్థ గ్యాస్ స్టేషన్లలో చెల్లింపులు చేసుకోవచ్చని తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ రివార్డు టోకెన్లను కరెన్సీగా మార్చుకునే అవకాశం కూడా ఇస్తారని సమాచారం. యూజర్లు యూపీఐతో లింక్ చేసిన బ్యాంకు అకౌంట్ ద్వారా ఈ కాయిన్లను రీడీమ్ చేసుకునే అవకాశం ఉండొచ్చు.
భవిష్యత్తులో ఈ కాయిన్ ద్వారా మరికొన్ని బ్లాక్‌చైన్, వెబ్3 ప్రొడక్టులు అందుబాటులోకి రానున్నాయి. వస్తాయని అంటున్నారు. నిజానికి భారత్‌లో భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ రూల్స్ ఎలా ఉంటాయన్న దానిపై సందిగ్ధత నెలకొంది. అయినప్పటికీ, ఈ సమయంలో జియో కాయిన్ తీసుకురావడం గమనార్హం.
‘డిప్యూటీ సీఎం’ ప్రచారంపై నారా లోకేశ్ రియాక్షన్.. నా టార్గెట్ ఇదే.. అసలు విషయం రివీల్..