Gold Rates: బంగారం ధరల్లో ఈ మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? మార్కెట్లో ఈ పరిస్థితులకు కారణాలేంటి?

ఓ ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇవ్వలేదు. దీంతో కొంతమేరకు గ్లోబల్ స్టాక్స్ క్షీణించాయి.

Gold Rates: బంగారం ధరల్లో ఈ మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? మార్కెట్లో ఈ పరిస్థితులకు కారణాలేంటి?

Updated On : March 11, 2025 / 1:56 PM IST

డాలర్ బలహీనత, ట్రెజరీ ఈల్డ్స్(అమెరికా ప్రభుత్వానికి బాండ్ల నుండి వచ్చే రాబడి) తగ్గడంతో అంతర్జాతీయంగా ఇవాళ బంగారం ధర పెరిగింది. అలాగే అమెరికా ద్రవ్యోల్బణం డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ డేటా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది. అంతేగాక, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా ఆర్థిక విధానాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

అంతర్జాతీయంగా ఇవాళ ఉదయం నమోదైన ధరల ప్రకారం స్పాట్ గోల్డ్ ధర 0.3% పెరిగి 2,898.27 డాలర్లకు చేరుకుంది. అలాగే అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.1% పెరిగి 2,902.50 డాలర్లకు చేరింది.

గత నాలుగు నెలల్లో డాలర్ సూచీ కనిష్ఠ స్థాయికి చేరుకోవడం వల్ల ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ విలువ తగ్గింది. ఈ నేపథ్యంలో 10-సంవత్సరాల అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గాయి.

Also Read: “ఎక్స్‌”పై సైబర్‌దాడి వారి పనే..!: ఎలాన్‌ మస్క్‌

“డాలర్ అలాగే ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం వంటి అంశాలను పరిశీలిస్తే.. బంగారం ధరలు పెరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది” అని టాస్టీలైవ్ గ్లోబల్ మాక్రో విభాగాధిపతి ఇల్యా స్పివాక్ అన్నారు. “గత నాలుగు వారాలుగా బంగారం ధరలు ఔన్సుకి 2,830 నుంచి 2,960 డాలర్ల మధ్య ధరలు స్థిరంగా ఉన్నాయి” అని ఆయన చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక సుంకాల వల్ల యూఎస్‌ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. దీంతో కొంతమేరకు గ్లోబల్ స్టాక్స్ క్షీణించాయి.

ట్రంప్ గత మంగళవారం మెక్సికో, కెనడా నుంచి దిగుమతులపై 25% సుంకాన్ని విధించారు. అదే సమయంలో, కొన్ని మెక్సికన్, కెనడియన్ దిగుమతులను ఒక నెలపాటు మినహాయించారు. దీంతో మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది, అలాగే అమెరికా ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ వృద్ధి గురించి భయాలు పెరిగాయి.

ఇప్పుడు అందరూ బుధవారం విడుదల కానున్న అమెరికా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) డేటా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల భవిష్యత్ ప్రణాళికపై స్పష్టత ఇస్తుందనే ఆశతో పెట్టుబడిదారులు ఉన్నారు.

రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడి సురక్షితమైన ఆస్తిగా భావిస్తారు. కానీ, పెరిగే ధరల కారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా ఉండవలసి వస్తే బంగారం ధర పెరిగే అవకాశముంది.