Cyberattack on X: “ఎక్స్”పై సైబర్‌దాడి వారి పనే..!: ఎలాన్ మస్క్
యుక్రెయిన్, అమెరికా మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ సైబర్ దాడి జరగడం గమనార్హం.

Elon Musk
అనేక దేశాల్లో సోమవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగింది. దీంతో యూజర్లు ఎక్స్‌ను వాడుకోలేకపోయారు. దీంతో ‘ఎక్స్’ యాజమాని ఎలాన్ మస్క్ దీనిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఎక్స్‌పై భారీ సైబర్ దాడి జరిగిందన్నారు. తాము ప్రతిరోజు సైబర్ దాడిని ఎదుర్కొంటున్నప్పటికీ, ఇప్పుడు జరిగిన సైబర్‌దాడి వెనక ఓ పెద్ద గ్రూప్, ఓ దేశం ఉందని తాము అనుమానిస్తున్నట్లు చెప్పారు.
ఈ దాడి ఎలా జరిగిందో తెలుసుకునేందుకు తమ టీమ్ పనిచేస్తోందని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ సైబర్ దాడి వెనుక యుక్రెయిన్ హస్తం ఉండవచ్చని అన్నారు. ప్రస్తుతం కచ్చితంగా ఏం జరిగిందో చెప్పలేకపోతున్నామని తెలిపారు.
Also Read: భవిష్యత్తులో మనం బొద్దింక పాలను తాగుతామా? ఆవు పాల కంటే బెటర్.. అంతేకాదు..
ఈ దాడిని తమ ఎక్స్ సిస్టమ్‌కు అంతరాయం కలిగించేందుకే చేశారని ఎలాన్ మస్క్ అన్నారు. ఈ దాడికి సంబంధించిన ఐపీ అడ్రస్‌లు యుక్రెయిన్ ప్రాంతానికి చెందినవని తెలుస్తోందని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన ఇతర వివరాలు మస్క్ చెప్పలేదు.
యుక్రెయిన్, అమెరికా మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ సైబర్ దాడి జరగడం గమనార్హం. గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ‘నియంత’ అని పిలిచారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఓవల్ ఆఫీస్‌లో సమావేశం జరిగింది. అందులో ఇరువురు నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్న తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది.
మరోవైపు, రష్యా – యుక్రెయిన్ మధ్య చాలా కాలంగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎలాన్ లాన్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యుద్ధాన్ని శాశ్వతంగా కొనసాగేలా చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఒకవేళ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసులను ఆపేస్తే యుక్రెయిన్ సేనలు కుప్పకూలుతాయని చెప్పారు.