Xiaomi LED TV : 98 అంగుళాల షావోమీ మినీ ఎల్ఈడీ టీవీ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
Xiaomi LED TV : షావోమీ మినలీ ఎల్ఈడీ టీవీ రిలీజ్ అయింది. 98 అంగుళాల మినీ ఎల్ఈడీ టీవీ కీలక ఫీచర్లు, ధర వివరాలు ఇవే..
Xiaomi LED TV
Xiaomi LED TV : కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా టెక్ దిగ్గజం షావోమీ హై-ఎండ్ మినీ ఎల్ఈడీ టీవీ లైనప్‌ను విస్తరించింది. కొత్త 98-అంగుళాల మోడల్‌లో షావోమీ టీవీ ఎస్ ప్రో మినీ ఎల్ఈడీ 2026 ఎడిషన్ టీవీని లాంచ్ చేసింది.
ఈ కొత్త వేరియంట్ 2025 ఏడాది ప్రారంభంలో 85-అంగుళాల వెర్షన్, గత నెలలో (Xiaomi LED TV) యూరప్‌లో ఆవిష్కరించిన 55, 65, 75-అంగుళాల మోడళ్ల మాదిరిగా ఉంటుంది. భారీ స్క్రీన్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, హై-ఎండ్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి అద్భుతంగా ఉంటుంది.
ధర, లభ్యత :
షావోమీ టీవీ ఎస్ ప్రో మినీ ఎల్ఈడీ 98-అంగుళాల ధర 7,599 యువాన్లు (సుమారు రూ. 94వేలు)కు అందిస్తోంది. ఇప్పుడు చైనాలో ప్రీ-సేల్‌కు అందుబాటులో ఉంది. అతి త్వరలో అమ్మకానికి వస్తుంది.
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
98-అంగుళాల షావోమీ టీవీ ఎస్ ప్రో మినీ ఎల్ఈడీ 178° వ్యూయింగ్ యాంగిల్, 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్, MEMC 4K 120Hz మోషన్ స్మూతింగ్‌తో 4K UHD (3840×2160) QD మినీ LED ప్యానెల్ కలిగి ఉంది. DCI-P3 కలర్ గామట్‌లో 94శాతం కవర్ చేస్తుంది. HDR10+, HLG, డాల్బీ విజన్, ఫిల్మ్‌మేకర్ మోడ్‌కు సపోర్టు ఇస్తుంది.
డిస్‌ప్లే 1300 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ అప్‌గ్రేడ్ కోసం 880 మినీ ఎల్ఈడీ జోన్‌లతో గ్లోబల్ డిమ్మింగ్‌ను అందిస్తుంది. ఇంకా, షావోమీ విజువల్ ఇంజిన్ ప్రో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇమేజ్ క్రియేషన్ కోసం షావో లో రిప్లెక్షన్ లేయర్, గ్లోబల్ డిమ్మింగ్ అల్గారిథమ్‌లను ఇంటిగ్రేట్ చేస్తుంది. గేమర్ల కోసం ఈ టీవీ 288Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. స్పీడ్ టైటిల్స్‌లో స్మూత్ మోషన్, లో-ఇన్‌పుట్ లాగ్‌ను అందిస్తుంది.
ఆడియో విషయానికి వస్తే..
హర్మాన్ ద్వారా ట్యూన్ చేసిన 7-యూనిట్ స్పీకర్ సెటప్ (2×15W + 25W + 2×8W) పొందుతారు. డాల్బీ అట్మోస్, హర్మాన్ ఆడియోఇఎఫ్ఎక్స్ సౌండ్ ఆప్టిమైజేషన్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ గూగుల్ టీవీలో రనవుతుంది. క్వాడ్-కోర్ కార్టెక్స్-A73 ప్రాసెసర్, మాలి-G52 (2EE) ఎంసీ1 జీపీయూ, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.2, Wi-Fi 6, 3 HDMI 2.1 పోర్ట్‌లు (CEC, ALLM, VRR, eARC), రెండు USB పోర్ట్‌లు (2.0, 3.0), ఈథర్నెట్, ఆప్టికల్ ఆడియో అవుట్‌పుట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, CI+ స్లాట్ ఉన్నాయి. చాలా సన్నని ఫ్రేమ్, డ్యూయల్-స్టాండ్ కలిగి ఉంది. భారీ భవనాల్లోని గదులకు అద్భుతంగా ఉంటుంది.
ఈ లైనప్‌లోని చిన్న మోడళ్లతో పోలిస్తే.. 98-అంగుళాల ఎస్ ప్రో మినీ ఎల్ఈడీ అదే అడ్వాన్స్ బ్యాక్‌లైటింగ్, మోషన్ క్లారిటీ సిస్టమ్‌లతో భారీ ప్యానెల్ అందిస్తుంది. దాదాపు ప్రొజెక్టర్-సైజు స్క్రీన్ కలిగి ఉంటుంది. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
