చైనా చౌకబేరం : షియోమీ ఎలక్ట్రిక్ సైకిళ్లు విడుదల

  • Published By: sreehari ,Published On : April 26, 2019 / 10:54 AM IST
చైనా చౌకబేరం : షియోమీ ఎలక్ట్రిక్ సైకిళ్లు విడుదల

Updated On : April 26, 2019 / 10:54 AM IST

చైనా ఫోన్లు ఫుల్ ఫీచర్స్ – తక్కువ ధర. చైనా టీవీలదీ అదే ట్రెండ్. మొన్నటికిమొన్న వాషింగ్ మెషీన్స్.. ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా ఈ కాలంలో షియోమీ(MI) ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు లేటెస్టుగా షియోమీ కంపెనీ ఎలక్ట్రిక్ బైస్కిల్స్ (సైకిళ్లు) తీసుకువస్తోంది. ఇండియాలో రెడీ టూ రిలీజ్ అంటోంది కంపెనీ. 
అచ్చం మోపెడ్ లాగే ఉంది :
ఫీల్ గుడ్ గా ఉంది. లుక్ చూడగానే పాతకాలం నాటి మోపెడ్ గుర్తుకొస్తోంది. అప్పట్లో లూనా బండి మైండ్ లో మెదులుతుంది. సైడ్ స్టాండ్ ఉంది. రెండు సీట్లు ఉన్నాయి. డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ముందు, వెనక వీల్స్ కు సస్పెన్షన్ ఉంది. హిమో టీ1గా నామకరణం చేశారు. మోడల్ ఒకటే కానీ.. మూడు కలర్స్ లో మార్కెట్ లోకి రాబోతున్నాయి. 

రెండు కెపాసిటీల్లో ఎలక్ట్రిక్ సైకిళ్లు :
14,000mah బ్యాటరీ సామర్థ్యంతో పని చేస్తుంది. రెండు ఎనర్జీ ఆప్షన్స్ ఉన్నాయి. 14ah మోడ్ లో పెట్టుకుంటే 60 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. 28ah మోడ్ లో 120 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. బ్యాటరీ రెడ్ సింబల్ లోకి వచ్చిన తర్వాత కూడా 4.5 మీటర్లు.. ఎమర్జెన్సీ జర్నీ చేయొచ్చు. 53 కేజీల బరువు ఉంది బండి. 
దీని ధర ఇండియాలో 30వేల రూపాయలుగా ఉండొచ్చని అంచనా. త్వరలోనే భారత రోడ్లపై వీటిని చూడొచ్చు.
Also Read : ఏప్రిల్ 30 నుంచి సేల్ : ఒప్పో A9 వచ్చేసింది