మొబైల్ పేమెంట్స్ ఈజీ : గూగుల్ Play Storeలో షియోమీ Mi Pay యాప్

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లోకి వచ్చేసింది. అదే.. Mi Pay డిజిటల్ పేమెంట్స్ యాప్. ఈ యాప్ ఇప్పటివరకూ Mi స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం ప్లే స్టోర్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి Mi Pay యాప్ డౌన్ లోడ్ చేసుకుని యూజర్లు.. ఈజీగా మొబైల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అన్ని ఆండ్రాయిడ్ యూజర్లు ఈ Mi Pay యాప్ ను తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకుని ట్రాన్సాక్షన్లు జరుపుకోవచ్చు.
ఈ Mi Pay యాప్.. ICICI బ్యాంకు భాగస్వామ్యంతో డిజైన్ చేయడం జరిగింది. Mi Pay యాప్ ను తమ యూజర్ల కోసం ఈ ఏడాది మార్చిలో షియోమీ రిలీజ్ చేసింది. ఈ యాప్ ప్రారంభంలో MIUI 10 టెక్నాలజీ కలిగిన షియోమీ ఫోన్లపై అందుబాటులో ఉంది. ఆ తర్వాత MIUI ఆధారిత డివైజ్ ల కోసం Mi App స్టోర్లకు విస్తరించింది.
షియోమీ Mi Pay :
* గూగుల్ ప్లే, పేటీఎం, BHIM వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్ మాదిరిగానే Mi Pay యాప్ పని చేస్తుంది.
* మీ బ్యాంకు అకౌంటుతో ఈ యాప్‌ను UPI ద్వారా లింక్ చేసుకోవచ్చు.
* UPI ID లేదా బ్యాంకు అకౌంట్ నెంబర్ ద్వారా యూజర్లు మొబైల్ పేమెంట్స్ చేసుకోవచ్చు.
* Utility Bills, మొబైల్ రీఛార్జ్, DTH బిల్స్ చెల్లింపులను ఆఫ్ లైన్ లోనూ జరుపుకోవచ్చు.
* ఇతరుల నుంచి వ్యక్తిగత స్టాటిక్ లేదా డైనమిక్ QR కోడ్ ద్వారా పేమెంట్స్ రీసీవ్ చేసుకోవచ్చు.
* కాంటాక్ట్స్ సెక్షన్ నుంచే నేరుగా Appతో పేమెంట్స్ చేయొచ్చు.
* స్కానర్ యాప్, యాప్ వాల్ట్ స్ర్కీన్ ఆప్షన్ కూడా ఉంది.
* షియోమీ డివైజ్ లపై ఫోన్ మెసేజ్ లను కూడా యాప్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు.