ZOMATO 541 మంది ఉద్యోగులపై వేటు

  • Published By: madhu ,Published On : September 8, 2019 / 08:37 AM IST
ZOMATO 541 మంది ఉద్యోగులపై వేటు

Updated On : September 8, 2019 / 8:37 AM IST

ఫుడ్ డెలివరీ సంస్థల్లో ZOMATOకి మంచి పేరు ఉంది. ఎంతో మంది ఇందులో పని చేస్తున్నారు. సపోర్టు టీమ్‌లో 541 మందిని దేశ వ్యాప్తంగా తొలగించనుంది. అయితే..వీరిని తొలగించడం తమకు బాధాకరమే కానీ..ఇప్పుడే వారిని బయటకు పంపియ్యమని జొమాటో వెల్లడిస్తోంది. రెండు నుంచి మూడు నెలలు ఇక్కడే పనిచేసే ఛాన్స్ ఇస్తామని..2020 జనవరి వరకు తొలగించిన సిబ్బంది ఫ్యామిలీకి బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించింది. జొమాటో గోల్డ్ స్కీం‌పై రెస్టారెంట్లు ఓనర్లు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

గత కొన్ని నెలల నుంచి సంస్థకు భారీగా ఆర్డర్స్ రావడం..డెలివరీ చేయడంలో ఫెయిల్ అవుతుండడం జరుగుతోందని తెలిపింది. టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నిర్ణయించి..దానిని పరీక్షించడం జరిగిందని తెలిపింది. ఆర్డర్ సంబంధించి ప్రశ్నలన్నింటికీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానాలు చెప్పదలిచినట్లు పేర్కొంది. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ప్రస్తుతం తొలగించబడిన ఉద్యోగుల సంఖ్య 10 శాతంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం తమ ఆర్డర్స్‌కు 7.5 శాతం సపోర్టు మాత్రమే అవసరమని, ఇది మార్చిలో 15 శాతంగా ఉందని స్పష్టం చేసింది.