రూ.5 ఆశ చూపి, ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన మైనర్ బాలురు

  • Published By: murthy ,Published On : July 20, 2020 / 08:17 AM IST
రూ.5 ఆశ చూపి, ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన మైనర్ బాలురు

Updated On : June 26, 2021 / 11:47 AM IST

రాజస్థాన్ లో దారుణం జరిగింది. 5 రూపాయలు ఆశ చూపి 5 ఏళ్ల బాలికను ముగ్గరు బాలురు అత్యాచారం చేశారు. బారన్ జిల్లా టాంకీ మొహల్లాలలో నివసించే 5 ఏళ్ల బాలిక శుక్రవారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా..అదే గ్రామానికి చెందిన ఒక బాలుడు ఆమె వద్దకు వచ్చి తనతో వస్తే 5 రూపాయలు ఇస్తానని చెప్పాడు.

ఆ సమయంలో బాలిక తల్లి ఇంట్లో వంట చేస్తోంది. 5 రూపాయలు వస్తాయని ఆశతో బాలిక, బాలుడి వెంట వెళ్లింది. బాలుడు బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకు వెళ్లాడు. అక్కడ అతనికి మరో ఇద్దరు బాలురు కలిశారు. ఇంకొంత దూరం తీసుకువెళ్లి ముగ్గురు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. ఇంట్లో వంట చేసుకుంటున్న తల్లి బయటకు వచ్చి చూడగా కూతురు కనపడలేదు. ఎంత సేపటికి తిరిగి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు ఆమె గురించి వెతకటం ప్రారంభించారు.

పొలానికి సమీపంలోని ఒక రోడ్డులో ఏడుస్తూ కూర్చున్న బాలికను తల్లి గుర్తించింది. ఎందుకు ఏడుస్తున్నావని కారణం అడుగుతూ తల్లి బాలికను పరిశీలనగా చూసింది. బాలికకు రక్తస్రావం అయినట్లు గమనించింది. బాలికను తీసుకుని నహర్ గ్రహ్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 164 కింద పోలీసులు కేసు నమోదు చేసారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.