లోయలో పడ్డ బస్సు ….అయిదుగురు దుర్మరణం

  • Published By: murthy ,Published On : October 21, 2020 / 11:40 AM IST
లోయలో పడ్డ బస్సు ….అయిదుగురు దుర్మరణం

Updated On : October 21, 2020 / 12:39 PM IST

Maharashtra accident : మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మల్కాపూర్ నుంచి సూరత్‌ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడగా.. ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.మరో 35 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఖామ్‌చౌందర్‌ గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి 1గంట సమయంలో జరిగింది. బస్సు సుమారు 50నుంచి 60 అడుగుల లోయలోకి పడిపోయింది.



సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను సమీపంలోని నందూర్ బార్ హాస్పిటల్‌కు తరలించారు. సంఘటనా స్థలాన్ని నందూర్బార్‌ ఎస్పీ మహేంద్ర పండిట్ సందర్శించారు.
https://10tv.in/husband-and-wife-suicide-due-to-health-problems-mancherial-district/
ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారని, 35 మంది వరకు గాయపడ్డారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కాగా, బస్సు మల్కాపూర్‌ నుంచి సూరత్‌కు వెళ్తుండగా పూణే-సోలాపూర్‌ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.



ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు.మరణించిన వారిలో డ్రైవర్‌, క్లీనర్‌ కూడా ఉన్నారు. పూణే-సోలాపూర్ హైవే 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొన్ని గంటల వ్యవధిలో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు ఎనిమిది మంది మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.