వీడు మహాముదురు… 25 ఏళ్లకే రూ.50 కోట్ల మోసం చేశాడు

CA student arrested in GST scam : టాక్స్ ఎగ్గోట్టటానికి ఫేక్ కంపెనీలు సృష్టించి రూ.50 కోట్లు దారి మళ్లించిన సీఏ విద్యార్ధిని జీఎస్టీ అధికారులు వడోదరాలో అరెస్ట్ చేశారు. గుజరాత్ లోని వడోదరాలోసీఏ విద్యార్ధి మనీష్ ఖత్రీ ట్యాక్స్ ఎగ్గోట్టటానికి 115 షెల్ కంపెనీలను సృష్టించాడు. వాటి ద్వారా వివిధ రూపాల్లో రూ.50.2 కోట్ల రూపాయలు టాక్స్ ఎగ్గోట్టాడు.
అనుమానాస్పద టాక్స్ పేయర్స్ ను వెలికితీసే పనిలో జీఎస్టీ అధికారులు ఖత్రి చేసిన ట్రాన్సాక్షన్ ను గుర్తించారు.ఖత్రీ నకిలీ ఇన్వాయిస్ లు సృష్టించి టాక్స్ కట్టాల్సిన డబ్బును వివిధ కంపెనీలకు తరలించి 50 కోట్ల రూపాయలకుపైగా మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
దాహుద్ అనే చిన్నగ్రామంలోని అమాయక ప్రజల నుంచి వారి బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకుని వారి పేరుమీద ఈ కంపెనీలు సృష్టించినట్లు అధికారులు తెలుసుకున్నారు. వారిఖాతాలు వాడుకున్నందుకు ..నెలకు కొంత మొత్తం చెల్లిస్తాననివారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా కొన్ని కంపెనీలు పన్నలు ఎగ్గోట్టేందుకు సహకారం అందించేందుకు ఫేక్ వెబ్ సైట్ తో నకిలీ కంపెనీలు సృష్టించినట్లు ఖత్రీ అంగీకరించాడు.