పెద్దలు తమ ప్రేమ పెళ్లికి అంగీకరించరని..

  • Published By: murthy ,Published On : October 20, 2020 / 08:35 AM IST
పెద్దలు తమ ప్రేమ పెళ్లికి అంగీకరించరని..

Updated On : October 20, 2020 / 12:00 PM IST

Nagarkurnool : తమ పెళ్లికి కుంటుబంలో పెద్దవాళ్లు అంగీకరించరనే భయంతో ప్రేమికులు ఆత్మ హత్య చేసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బల్మూరు మండలం బిల్లకల్లుకు చెందిన అఖిల(19) అదే మండలం చెంచుగూడెంకు చెందిన నిమ్మల అనిల్ (20) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ విషయం యువతి ఇంట్లో తల్లికి తెలియటంతో మందలించి కట్టడి చేసింది. ఈవిషయాన్ని ఆమె తన ప్రియుడు అనిల్ కు తెలిపింది. ఇంట్లో వాళ్లు తమ పెళ్లికి అంగీకరించరనే నిర్ధారించుకున్నారు. ఆదివారం రాత్రి అనిల్ బిల్లకల్లుకు వచ్చాడు. అఖిలను తీసుకుని బయటకు వెళ్లాడు.


https://10tv.in/robert-smith-billionaire-who-promised-to-pay-off-morehouse-student-loans-committed-tax-fraud/

సోమవారం తెల్లవారుఝూమున గం.4.40 సమయంలో అనిల్ తన స్నేహితుడికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో అతను మిగిలినవారికి చెప్పాడు. అంతా కలిసి అటవీ ప్రాంతంలో వెతికినా ప్రేమికుల ఆచూకి లభించలేదు. సోమవారం ఉదయం బిల్లకల్ సమీపంలోని రుషుల చెరువు అటవీ శాఖ బేస్ క్యాంపు వెనుక వున్న చెట్టుకు ఉరి వేసుకుని ఉన్న ప్రేమ జంటను పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.