ఆకతాయిల వెర్రిచేష్టలు : పాము తలకు కండోమ్ బిగించీ..

ఆకతాయిల వెర్రిచేష్టలు : పాము తలకు కండోమ్ బిగించీ..

Updated On : February 20, 2021 / 11:22 AM IST

Condom for keelback snake head : ఎవరో ఆకతాయిలు చేసిన పనికి పాపం ఓ పాము తలకు కండోమ్ బిగించారు. దీంతో పాపం ఆ పాము ఊపిరి తీసుకోలేక నానా ఇబ్బందులు పడింది. ఇంతో ఎవరో దాన్ని అలా చూసి దాని తలనుంచి కండోమ్ ను తొలగించటంతో బతికి బైటపడింది. మహారాష్ట్రలోని ముంబైలో గత శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

Condom for keelback snake head

గత శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ముంబైలోని మిడోస్‌ హౌసింగ్‌ సొసైటీ ఏరియాలో నివాసం ఉంటున్న వైశాలి తన్హా అనే యువతికి ఓ పాము.. తలకు చిన్న ప్లాస్టిక్‌ బ్యాగుతో ఉండంటం చూసింది. పాపం అది దిక్కుతోచని స్థితిలో అటుఇటు చాలా ఇబ్బందిగా కదులుతూ కనిపించటంతో..దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూడగా అది ప్లాస్టిక్ కవర్ కాదని అది కండోమ్ అని తెలుసుకుంది.

తలకు బాగా టైట్ గా కండోమ్ ఉండటంతో పాము చాలా ఇబ్బందిగా పాకుతుండటం చూసి జాలి వేసింది. దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. ఆ తరువాత మిఠా మల్వంకర్‌ అనే పాముల సంరక్షకుడికి ఫోన్‌ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మల్వంకర్‌ 2.5 అడుగుల నీటి పామును చేతుల్లోకి తీసుకున్నాడు. జాగ్రత్తగా కండోమ్‌ని తీసిపారేసి పామును రక్షించాడు.

అప్పటికే తలకు కండోమ్‌ టైటుగా ఉండటంతో పాము సరిగా ఊపిరి తీసుకోలేకపోవటం అస్వస్థతకు గురైంది. దాన్ని సంజయ్‌ గాంధీ నేషనల్‌ పార్కుకు తరలించి చికిత్స అందించాడు. అప్పటికే పోలీసులు కూడా వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుభవం ఉన్న వ్యక్తే పాము మెడకు కండోమ్‌ కట్టి ఉంటాడని, అది Keelback స్నేక్ అనీ..అది విష సర్పం కాకపోయినా దాని కాట్లు చాలా పదునుగా ఉంటాయని మల్వంకర్‌ తెలిపారు.

సంజయ్‌ గాంధీ నేషనల్‌ పార్కులో నిపుణులు ఆ పాముకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీనిపై వన్యప్రాణి పశువైద్య అధికారి డాక్టర్ శైలేష్ పేతే మాట్లాడుతూ..కండోమ్ చాలా టైటుగా ఉండటంతో పాము ఒత్తిడికి గురైంది కానీ..పాముమీద ఎటువంటి గాయాలు లేవనీ అది త్వరగానే కోలుకుంటుందని తెలిపారు.