కోట్లకు పడగలెత్తిన బిచ్చగత్తె..ఆస్తి కోసం హత్య చేసిన కోడలు

  • Published By: murthy ,Published On : July 17, 2020 / 05:25 PM IST
కోట్లకు పడగలెత్తిన బిచ్చగత్తె..ఆస్తి కోసం హత్య చేసిన కోడలు

Updated On : June 26, 2021 / 11:48 AM IST

తీవ్రగాయాలపాలైన 70 ఏళ్ల వృద్దురాలిని కుటుంబ సభ్యులు ముంబైలోని రజావాడి ఆస్పత్రికి తీసుకు వచ్చారు. బాత్రూమ్ లో కాలు జారి కింద పడిపోయిందని తీవ్రగాయాలయ్యాయి…చికిత్స చేయాలని వారు కోరారు. డాక్టర్లు చికిత్సకు చేసే లోపే ఆమె మరణించింది. ఆమె ఒంటిపై గాయాలు చూసిన డాక్టర్లుకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రికి వచ్చిన పోలీసులు విచారించగా షాకింగ్ విషయాలు బయట పడ్డాయి.

ముంబై లోని చెంబూరు ప్రాంతం పెస్తుం సాగర్ కు చెందిన యాచకురాలు సంజన పాటిల్ (70) ఘట్కోపర్ ప్రాంతంలో ఉన్న జైన మందిరం వద్ద భక్తులను యాచిస్తూజీవనం గడిపేది. అలా యాచించగా వచ్చిన డబ్బు కూడ బెట్టి చెంబూరు లో 2 ఫ్లాట్లు, వర్లీ ఏరియాలో మరో రెండు ఫ్లాట్లు కొనుగోలు చేసింది. ఇదే క్రమంలో అప్పుడప్పుడు బంగారం కూడా కోని దాచి పెట్టింది. తనకు ఉన్న నాలుగు ఫ్లాట్లలో 3 అద్దెకు ఇచ్చి ఒక దానిలో తాను జీవిస్తోంది. నెల నెలా మూడు ప్లాట్ల అద్దె, తనయాచన ద్వారా వచ్చిన డబ్బును ఇంట్లోదాచి పెట్టేది.

ఆమెకు పిల్లలు లేక పోవటంతో తన భర్తసోదరుడి కొడుకును దత్తత తీసుకుంది. భర్త కొన్నేళ్ల కిందట మరణించటంతో దత్తపుత్రుడు దినేష్ పాటిల్ , కోడలు అంజనా పాటిల్ తో కలిసి తన ఫ్లాట్ లో నివాసం ఉంటోంది. అత్త ఆస్తిపై కన్నేసిన కోడలు అత్తతో రోజూ తగువులాడేది. ఫ్లాట్లు నాలుగు తన పేరున రాయమని కోరేది. అత్తయాచించి తీసుకువచ్చిన డబ్బులు ఎక్కడ దాస్తోందో చెప్పమని గోడవ చేసేది. కోడలు ఎంత అడిగినా సంజన పాటిల్ ఏమీ సమాధానం చెప్పకుండా ఊరుకునేది.

డబ్బులు ఎక్కడ దాచిపెడుతోందో చెప్పటానికి సంజన నిరాకరించటంతో సోమవారం జులై 13 సాయంత్రం 3 గంటల సమయంలో అత్తాకోడళ్ళ మధ్య గొడవ మొదలైంది. కోడలు అంజనా అత్తపై దాడికి దిగింది. క్రికెట్ బ్యాట్ తీసుకుని 70 ఏళ్ల వృధ్దురాలిని విచక్షణా రహితంగా కొట్టింది. తాడు తీసుకువచ్చి సంజనా మెడకు బిగించి చంపేందుకు ప్రయత్నించింది. ఆ తాడు తెగి పోవటంతో పక్కనే ఉన్న మొబైల్ చార్జర్ వైరు ఆమె మెడకు బిగించి ఊపిరి ఆగిపోయేంతవరకు పట్టి ఉంచింది.

ఆమె శ్వాస ఆగిపోయి అపస్మారక స్దితిలోకి వెళ్లాక మొగుడు పెళ్లాలిద్దరూ కలిసి ఆమెను రజావాడి ఆస్పత్రికి తీసుకువెళ్లి బాత్ రూంలో కాలు జారి పడిపోయిందని కొత్త డ్రామా మొదలెట్టారు. ఆమె ఒంటిపై 14 చోట్ల గాయాలు ఉండటం… మెడకు వైరు బిగించిన ఆనవాళ్లు ఉండటం… చికిత్స అందించేలోపే ఆమె కన్ను మూయటంతో ఆస్పత్రి వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విచారణ చేపట్టిన పోలీసులకు భార్యా భర్తలు ఇద్దరూ సహకరించలేదు. పోలీసులు అడిగిన వాటికి పొంతన లేని సమాధానాలు ఇవ్వటం మొదలెట్టారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారని తెలుసుకుని, ఇంట్లో పిల్లలను అడిగారు. డబ్బుల విషయమై నానమ్మతో అమ్మ గొడవపడిందని మనవరాలు చెప్పింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారించే సరికి అంజనా నిజం ఒప్పుకుంది. ఆస్తి కోసం హత్య చేసినట్లు ఒప్పుకుంది.