కరీంనగర్‌లో మటన్ వ్యాపారి హత్య

  • Published By: murthy ,Published On : November 22, 2020 / 04:35 PM IST
కరీంనగర్‌లో మటన్ వ్యాపారి హత్య

Updated On : November 22, 2020 / 9:17 PM IST

mutton vendor murder karimnagar : తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తి తోటి వ్యాపారస్తుడిని హత్య చేశాడు. కరీంనగర్ సమీపంలోని బొమ్మకవ్ శివారులో మటన్ వ్యాపారి ఎండీ వలీంపాషా ఆదివారం హత్యకు గురయ్యాడు. మరో మటన్ వ్యాపారి సయ్యద్ అఫ్జల్ తల్వార్ తో వలీంపాషా పై దాడి చేసి హతమార్చాడు. అఫ్జల్ తల్వార్ తో పాషా మెడపై దాడి చేయటంతో అక్కడి కక్కడే కుప్పకూలిపోయాడు.

వలీంపాషా హుస్సేన్ పుర లో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉండే మరో మటన్ వ్యాపారి అఫ్జల్ భార్యతో, పాషా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు … ఆమె భర్త అనుమానించాడు. గతంలోనూ వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని, తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతోనూ అఫ్జల్ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దాడి అనంతరం అఫ్జల్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.