ఆస్తి కోసం మేనమామను కిడ్నాప్ చేసిన మేనకోడలు

  • Published By: murthy ,Published On : October 25, 2020 / 12:11 PM IST
ఆస్తి కోసం మేనమామను కిడ్నాప్ చేసిన మేనకోడలు

Updated On : October 25, 2020 / 12:34 PM IST

niece was found have kidnapped maternal uncle : ఆస్తులు కోసం గొడవలు జరగటం సాధారణంగా చూస్తూనే ఉంటాం. దాని వల్ల కొన్ని సార్లు హత్యలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. బెంగుళూరు కు చెందిన ఒక యువతి ఆస్తి కోసం సొంత మేన మమాను కిడ్నాప్ చేయించి పోలీసులకు దొరికిపోయింది.

బెంగళూరు ఉత్తర తాలూకా హనియూరు గ్రామానికి చెందిన అంజన్‌గౌడ(50), ఇతని మేనకోడలు మౌన(23). మౌన ఇటీవల ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన తల్లి పుట్టింటి ఆస్తి తనకు ఇవ్వాలని మౌన పలు మార్లు మామ అంజనగౌడతో గొడవ పడింది. ఆస్తి ఇవ్వటానికి అతను ఒప్పుకోలేదు.


మేనమామను దగ్గర నుంచి ఎలాగైనా సరే తల్లి పుట్టింటి ఆస్తి వసూలు చేసుకోటానికి మనోజ్‌ అనే యువకునితో మౌన బేరం కుదుర్చుచుకుంది. మనోజ్ ద్వారా అంజన్‌గౌడను కిడ్నాప్‌ చేయించింది. తండ్రి కిడ్నాప్ అవటంతో బాధితుని కుమార్తె ఈ నెల 22న దొడ్డబళ్లాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శుక్రవారం నాడు మొబైల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు మౌన, మనోజ్ లను వెంటాడి రాజానుకుంట సమీపంలో వారు వెళుతున్న ఇన్నోవా కారును అడ్డుకున్నారు. ఈ సమయంలో మనోజ్‌ అతని స్నేహితులు పోలీసులపై దాడిచేయడంతో రాజానుకుంట ఎస్సై శంకరప్ప గాయపడ్డారు.


దీంతో పోలీసులు కాల్పులు జరపగా మనోజ్‌ కాలికి బుల్లెట్‌ తగిలింది. అంజన్‌గౌడను కాపాడి మనోజ్‌ను, మౌనను అరెస్టు చేశారు. పరారైన మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.