Monkeys:కోతుల నుంచి తప్పించుకోబోయి బాలింత మృతి

కోతుల దాడి నుంచి తప్పించుకోబోయే క్రమంలో ఓ బాలింత కిందపడి దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. జిల్లాలోని మద్దిరాల మండలం కుక్కడం గ్రామానికి చెందిన శ్రీలతకు అర

Monkeys:కోతుల నుంచి తప్పించుకోబోయి బాలింత మృతి

Updated On : January 20, 2022 / 3:34 PM IST

women died ,monkeys attack in suryapet district : కోతుల దాడి నుంచి తప్పించుకోబోయే క్రమంలో ఓ బాలింత కిందపడి దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. జిల్లాలోని మద్దిరాల మండలం కుక్కడం గ్రామానికి చెందిన శ్రీలతకు అర్వపల్లి మండలం అడివెంలకు చెందిన జేసీబీ డ్రైవర్‌ దోమల సైదులుతో ఏడేళ్ల క్రితం పెళ్ళైంది.

వీరికి ఇప్పటికే నాలుగేళ్ల కొడుకు బిట్టు, రెండున్నరేళ్ల కుమార్తె మాన్యశ్రీ ఉన్నారు. మూడో కాన్పు కోసం శ్రీలత (24) మూడు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. నెల క్రితం సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం తల్లిగారింటి ముందు రేకుల షెడ్‌ కింద ఊయలలో చిన్నారి పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో శ్రీలత బట్టలు ఉతికి ఆరేస్తుండగా ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేసింది.


కోతుల బారి నుంచి తప్పించుకునే క్రమంలో బాబును తీసుకుని ఇంట్లోకి వెళ్లాలనుకున్న శ్రీలత.. కోతుల గుంపు మరింత ముందుకు ఉరకడంతో భయంతో బాబును అక్కడే ఉంచి ఇంట్లోకి పరుగు తీసింది. అలా లోపలికి పరిగెత్తబోయి… గడప తగిలి కిందపడింది. కింద పడటంతో అక్కడ పక్కనే ఉన్న మంచంకోడు ఆమె తలకు బలంగా తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది.


ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలి భర్త సైదులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపారు. ప్రభుత్వం స్పందించి కోతుల బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.