నాలుగేళ్ల చిన్నారులపై 10వ తరగతి విద్యార్థి లైంగిక దాడి : సెల్ ఫోన్ లో చూపించి

  • Published By: veegamteam ,Published On : December 10, 2019 / 08:28 AM IST
నాలుగేళ్ల చిన్నారులపై 10వ తరగతి విద్యార్థి లైంగిక దాడి : సెల్ ఫోన్ లో చూపించి

Updated On : December 10, 2019 / 8:28 AM IST

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వెల్దండ మండల కేంద్రంలో నాలుగేళ్ల ఇద్దరు చిన్నారులపై అత్యాచార యత్నానికి పాల్పడాడు 10వ తరగతి విద్యార్థి. ఆదివారం(డిసెంబర్ 8,2019) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అఘాయిత్యం సమయంలో చిన్నారులు భయంతో కేకలు వేయడంతో సదరు బాలుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రేపిస్టులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వస్తున్నాయి. కఠిన చట్టాలు తేవాలని, అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని.. అప్పుడే ఇలాంటి ఘోరాలకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు. అయితే మైనర్లు కూడా పెడదోవ పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి దగ్గర ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. వారి ఇంటి పక్కనే 10వ తరగతి విద్యార్థి ఉంటున్నాడు. వారి దగ్గరికి వచ్చిన అబ్బాయి.. మొబైల్ లో నీలి చిత్రాలు చూపించాడు. ఇలానే చేద్దామని వారితో అన్నాడు. దీంతో భయపడిపోయిన పిల్లలు.. కేకలు వేయడంతో చుట్టుపక్కలున్న వారు గమనించి… అమ్మాయిలను తీసుకెళ్లారు. విషయం తెలిసిన చిన్నారుల తల్లిదండ్రులు.. రాత్రి వరకు వేచి చూశారు.

సోమవారం(డిసెంబర్ 9,2019) ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ కావడంతో ఫిర్యాదు చేయాలని అనుకోలేదు. అయితే భవిష్యత్తులో మళ్లీ తప్పు చేయకూడదనే భావనతో పోలీసులకు చిన్నారుల తల్లిదండ్రులు పిర్యాదు చేశారు. ఆ అబ్బాయితో పోలీసులు మాట్లాడారు. అతడిని హెచ్చరించి పంపారు. ఆ తర్వాత అబ్బాయి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. వారికి ఫోన్ ఇవ్చి చెడగొట్టొద్దన్నారు. కాగా, బుద్దిగా చదుకుకోవాల్సిన వయసులో.. ఓ మైనర్ ఇలాంటి దారుణానికి పాల్పడటం జిల్లాలో కలకలం రేపింది. తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది.