నీళ్లు పోయొద్దంటే కత్తితో పొడిచిన 12 ఏళ్ల పిల్లోడు

నీళ్లు పోయొద్దంటే కత్తితో పొడిచిన 12 ఏళ్ల పిల్లోడు

దేశమంతా రంగులతో నిండిపోయే హోలీ పండుగ రావడానికి ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఈ లోపే మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ 12ఏళ్ల పిల్లోడు..  16ఏళ్ల టీనేజర్‌ను కత్తితో పొడిచాడు. హనుమాన్ నగర్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 

హోళీ పండగ వారం రోజులు ఉండగానే.. ఆ ప్రాంతంలో సందడి మొదలైపోయింది. ఆటో డ్రైవర్ కొడుకైన ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లోడు రంగులకు బదులు వాటర్ బెలూన్‌ను విసురి అక్కడ ఉన్నవాళ్లని ఆటపట్టిస్తున్నాడు. ఆ ప్రాంతంలోనే తెలిసిన యజమాని దగ్గర 16ఏళ్ల టీనేజర్ పని చేస్తున్నాడు. 
Read Also : కాపురంలో ‘దున్నపొతు’ చిచ్చు.. భార్య కాళ్లను నరికేసిన భర్త

వాటర్ బెలూన్ తీసుకుని వస్తున్న పిల్లోడ్ని రావొద్దంటూ వారించాడు. వస్తే ఊరుకోనని హెచ్చరించాడు. అంతే ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకుని వచ్చి చాతీపై, కడుపులో పలుమార్లు పొడిచాడు. స్థానికులు నిందితుడ్ని అదుపుచేసి బాధితుడ్ని సెంట్రల్ హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత కేఈఎమ్ హాస్పిటల్ కు బదిలీ చేశారు. 

బాధితుడి అన్నయ్య మాట్లాడుతూ.. ఆ పిల్లోడ్ని వాటర్ బెలూన్ విసరొద్దని.. మాట వినకపోతే పోలీసులకు చెప్తానని వారించాడు. అంతే ఆవేశంలో ఇంట్లో నుంచి కత్తి తీసుకుని వచ్చి ఘోరానికి పాల్పడ్డాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితుడ్ని పోలీసులు భీవండీ రిమాండ్ హోమ్‌కు తరలించారు.