బోయింగ్ విమానం క్రాష్…15మంది మృతి

ఇరాన్ రాజధాని తెహ్రాన్ కి సమీపంలోని ఫత్ విమానాశ్రయం దగ్గర సైన్యానికి చెందిన బోయింగ్ 707 కార్గో విమానం క్రాష్ అయింది. విమానంలో ఉన్న 16మందిలో 15మంది ఈ ఘటనలో చనిపోయారని ఇరాన్ ఆర్మీ తెలిపింది. విమాన ఇంజినీర్ మాత్రమే ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డాడని, అతడిని హాస్పిటల్ కు తరలించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
మాంసం సరఫరా చేసేందుకు కిర్గిస్తాన్ లోని బిష్కెక్ నుంచి ఈ బోయింగ్ 707 కార్గో విమానం బయలుదేరింది.అయితే వెదర్ అనుకూలించకపోవడంతో పైలెట్ విమానాన్ని ఫత్ ఎయిర్ పోర్ట్ లో సోమవారం(జనవరి 14,2019) ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించాడు.
ల్యాండింగ్ సమయంలో విమానం రన్ వేపై నుంచి జారిపోయి రన్ వే చివర్లో ఉన్న గోడను ఢీకొట్టిందని ఆర్మీ తెలిపింది. గోడను ఢీ కొట్టడంతో విమానంలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న వెంటనే సహాయ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొన్నారు. హెలికాఫ్టర్, అంబులెన్స్ తో సిబ్బంది సహాయచర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టార