ఏడాదిన్నరగా 17ఏళ్ల బాలికపై పక్కంటి వ్యక్తి అత్యాచారం..

  • Published By: sreehari ,Published On : October 11, 2020 / 08:17 PM IST
ఏడాదిన్నరగా 17ఏళ్ల బాలికపై పక్కంటి వ్యక్తి అత్యాచారం..

Updated On : October 11, 2020 / 8:28 PM IST

Dalit Girl Rape : ఏడాదిన్నరగా 17బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో కిచకుడు.. పక్కంట్లో ఉంటేనే బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని యూపీ పోలీసులు వెల్లడించారు. బాధిత బాలిక తల్లి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో 20ఏళ్ల వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.



బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ హెచ్ఓ సింగ్ పేర్కొన్నారు. అత్యాచార నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.



‘తన 17ఏళ్ల కూతురిన్ని పక్కింట్లో ఉండే 20ఏళ్ల వ్యక్తి గత ఏడాదిన్నరగా అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ దళిత బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది’ అని SHO రెవితి పోలీసు స్టేషన్ రాజీవ్ సింగ్ పేర్కొన్నారు.