అక్రమ సంబంధం వద్దన్నందుకు స్నేహితుడిపై కాల్పులు : అరెస్ట్

2 Men In UP Fire At Friend For Objecting To Affair With His Wife, Sister: కరోనా లాక్ డౌన్ సమయంలో ఆశ్రయం కల్పిస్తే ఇంట్లోని ఆడవారితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని అభ్యంతరం చెప్పినందుకు స్నేహితుడిపైనే కాల్పులు జరిపారు ఇద్దరు వ్యక్తులు. అజయ్, నదీమ్, మనోజ్ వర్మ లు ఢిల్లీలోని నాంగ్లోయిలోని ఒక ఫ్లాట్ లో కలిసి నివశించేవారు. కరోనా లాక్ డౌన్ సమయంలో నదీం, అజయ్ లు ఘజియాబాద్ లోని మనోజ్ వర్మ ఇంటికి వచ్చి ఆశ్రయం పొందారు. ఆసమయంలో మనోజ్ వర్మ భార్యతో నదీమ్, సోదరితో అజయ్ లు అక్రమ సంబంధం పెట్టుకున్నారు.
కొంతకాలానికి ఈ విషయం మనోజ్ వర్మకు తెలిసి…. అభ్యంతరం తెలిపాడు. వివాహేతర సంబంధాలు వద్దని మిత్రులకు చెప్పాడు. మిత్రుడి మాటలు నచ్చని నదీమ్, అజయ్ లు వర్మను చంపేందుకు యత్నించారు. ఇందుకోసం మారణాయుధాలు సిధ్దం చేసుకున్నారు.
వర్మను చంపేందుకు ప్లాన్ చేసుకుని ఒకరోజు కాల్పులు జరిపారు. కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘజియాబాద్ పోలీసులు నదీమ్ అజయ్ లను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రెండు లైవ్ కాట్రిడ్జులను, ఒక పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం కేసునమోదు చేసి రిమాండ్ కు తరలించారు.