మూగ యువతిపై మైనర్ల సామూహిక అత్యాచారం

మూగ యువతిపై మైనర్ల సామూహిక అత్యాచారం

Updated On : June 21, 2021 / 5:39 PM IST

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. మాటలు రాని 20 ఏళ్ల మూగ యువతిపై నలుగురు మైనర్లు అత్యాచారం చేశారు. వారిలో 11 ఏళ్ల చిన్నపిల్లవాడు కూడా ఉన్నాడు. వీరిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో బహిర్భూమికి వెళ్ళిన 20 ఏళ్ల యువతిపై నలుగురు మైనర్లు అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. బహిర్భూమికి వెళ్ళిన యువతి ఎంతకూ తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు వెతకగా రోడ్డు పక్కన గాయాలతో ఆమె కనిపించింది.

వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆమె చెప్పిన ఆధారాలతో కుటుంబ సభ్యులు గౌరీహార్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు చెప్పిన ఆధారాలతో పోలీసులు నిందితులను అరెస్టు చేయగా బాధితురాలు వారిని గుర్తించింది. నిందింతుతలంతా 11 నుంచి 18 ఏళ్ల లోపు వారని పోలీసులు చెప్పారు.నిందితులు నేరం ఒప్పుకున్నారని పోలీసు సూపరింటెండెంట్ సచిన్ శర్మ తెలిపారు. కేసు తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

Read:అతనితో ఎలాంటి సంబంధం లేదు.. విచారణ తర్వాత మీడియా ముందుకు వస్తా: షమ్నా ఖాసిం(పూర్ణ)