పనిమనిషే ప్లాన్ చేశాడు : యజమానిని ఫ్రిజ్ లో కుక్కి కిడ్నాప్

ఢిల్లీలో దారుణం జరిగింది. నమ్మిన వాడే ముంచాడు. పని మనిషే కిడ్నాపర్ గా మారాడు. యజమానిని ఫ్రిజ్ లో కుక్కి కిడ్నాప్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో

  • Published By: veegamteam ,Published On : September 3, 2019 / 05:41 AM IST
పనిమనిషే ప్లాన్ చేశాడు : యజమానిని ఫ్రిజ్ లో కుక్కి కిడ్నాప్

Updated On : September 3, 2019 / 5:41 AM IST

ఢిల్లీలో దారుణం జరిగింది. నమ్మిన వాడే ముంచాడు. పని మనిషే కిడ్నాపర్ గా మారాడు. యజమానిని ఫ్రిజ్ లో కుక్కి కిడ్నాప్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో

ఢిల్లీలో దారుణం జరిగింది. నమ్మిన వాడే ముంచాడు. పని మనిషే కిడ్నాపర్ గా మారాడు. యజమానిని ఫ్రిజ్ లో కుక్కి కిడ్నాప్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో నివసించే కిషన్ దేవ్ ఖోస్లా (92) రిటైర్డ్ ఉద్యోగి. భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. తమకు సాయంగా ఉంటాడని కిషన్ అనే యువకుడిని పనిమనిషిగా పెట్టుకున్నారు. ఎంతో నమ్మకంగా కిషన్ ని చేరదీస్తే.. అతడు దారుణానికి ఒడిగట్టాడు. కిషన్ కి దుర్బుద్ది పుట్టింది. ఓనర్ ని కిడ్నాప్ చేశాడు. ఓ రోజు మినీ లారీతో ఖోస్లా ఇంటికి వచ్చాడు. కిషన్ వెంట కొందరు వ్యక్తులు కూడా వచ్చారు. ఖోస్లా దంపతులకు వారు మత్తుమందు ఇచ్చారు. వారు వెంటనే అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. ఖోస్లాను ఓ ఫ్రిజ్ లో కుక్కి తాము తీసుకొచ్చిన మిని లారీలో వేసుకుని వెళ్లిపోయారు.

మరుసటి రోజు ఉదయానికి ఖోస్లా భార్య మత్తు నుంచి తేరుకోలేకపోయింది. భర్త కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. కొందరు వ్యక్తులు ఫ్రిజ్ ను మినీ లారీలో తరలించడం అందులో రికార్డయింది. దానికితోడు కిషన్ కనిపించకపోవడంతో ఇది అతడి పనే అని నిర్ధారించారు. పోలీసులు పలు బృందాలుగా రంగంలోకి దిగారు. ముమ్మరంగా గాలించారు. చివరికి కిషన్ ఆచూకీ లభించింది. కిషన్ తో పాటు అతడి సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషన్ ఇంట్లో ఫ్రిజ్ ని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఖోస్లా మృతదేహాన్ని బయటికి తీశారు. డబ్బు కోసమే కిషన్ ఈ పని చేశాడని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన రోజున ఇంట్లో బంగారు ఆభరణాలు కూడా కిషన్ ఎత్తుకెళ్లాడు.

ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కిషన్ అతడి సహచరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నమ్మినవాడే దారుణానికి తెగబడటంతో ఖోస్లా కుటుంబసభ్యులు షాక్ కు గురయయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పని మనుషులను, సహాయకులను పెట్టుకునే సమయంలో వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నేర చరిత్ర ఏమైనా ఉందా లేదా అనే వివరాలు తెలుసుకుంటే మంచిదన్నారు.