Teacher Harass : ముద్దులు పెట్టేవాడు, అసభ్యకరంగా తాకేవాడు.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై పీఈటీ లైంగిక దాడి
ప్రభుత్వ స్కూల్ లో దారుణం జరిగింది. 54 ఏళ్ల పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) నీచానికి ఒడిగట్టాడు. 15మంది విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Teacher Harass : గురువంటే దైవంతో సమానం. తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు మంచి చెడులు చెప్పేది గురువే. విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులు సక్రమ మార్గంలో వెళ్లేలా చూసేది గురువే. పిల్లలు తప్పు చేయకుండా చూడాల్సిందీ గురువే. అందుకే గురువుని దైవంతో సమానంగా చూస్తారు. అయితే, కొందరు గురువులు దారి తప్పుతున్నారు. పాడు పనులతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారు. భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు.
కర్నాటక రాష్ట్రం హెబ్బలలోని ఓ ప్రభుత్వ స్కూల్ లో దారుణం జరిగింది. 54 ఏళ్ల పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) నీచానికి ఒడిగట్టాడు. 15మంది విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతగాడు గత మూడు నెలలుగా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. లైంగిక దాడి కేసులో పోలీసులు పీఈటీని అరెస్ట్ చేశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఆటలు ఆడించేటప్పుడు విద్యార్థినులకు ముద్దులు పెట్టడంతో పాటు అసభ్యకరంగా తాకేవాడని బాధిత విద్యార్థినులు తెలిపారు. వేధింపులు ఎక్కువ కావడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో చెప్పారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పీఈటీ బండారం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. విద్యార్థులను లైంగిక వేధించిన ఆ టీచర్ ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.