Bengaluru Accident : బెంగళూరులో 77ఏళ్ల వృద్ధుడు అనుమానాస్పద మృతి.. బయటపడ్డ షాకింగ్ నిజాలు..!
Bengaluru Accident : బెంగళూరులో 77ఏళ్ల వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అది చూసిన వారంతా రోడ్డుప్రమాదమని భావించారు. కానీ, సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన అనంతరం అది హత్య అని తేలడంతో పోలీసులు షాకయ్యారు.

77-Year-Old Bengaluru Man Dies In 'Accident', CCTV Footage Reveals
Bengaluru Accident : బెంగళూరులో ఒక అనుమానాస్పద మృతి కేసు అక్కడి పోలీసులను ఉరుకులు పెట్టించింది. 77ఏళ్ల వృద్ధుడిగా గుర్తించిన పోలీసులు మొదట రోడ్డు ప్రమాదంగా అనుమానించారు. కానీ, లోతుగా కేసును విచారించిన తర్వాత అసలు షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు చివరికి అది రోడ్డుప్రమాదం కాదు.. హత్య అని తేల్చేశారు. రోడ్డుపై వెళ్తున్న క్రమంలో వృద్ధుడిని ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
Read Also : AP Crime: దెందులూరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య కేసులో భార్య, అత్తమామలు అరెస్ట్
పోలీసుల కథనం ప్రకారం.. నవంబర్ 16న కృష్ణప్ప అనే 77ఏళ్ల వృద్ధుడు.. వాయువ్య బెంగళూరులోని ప్యాలెస్ గుట్టహళ్లి ప్రాంతంలోని తన ఇంటి నుంచి సమీపంలోని మెడికల్ షాపులో కొన్ని మందులు తీసుకోవడానికి బయటికి వచ్చాడు. మందులు కొనుక్కొని పార్కింగ్ ప్రాంతానికి తిరిగి రాగా.. ద్విచక్రవాహనాన్ని బైక్‌పై వచ్చిన వ్యక్తి ఢీకొట్టాడు. కృష్ణప్ప సర్ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి సరిగ్గా రైడ్ చేయమని అడిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన సర్ఫరాజ్.. వృద్ధుడిదే తప్పంటూ నిలదీశాడు.
వృద్ధుడి తలపై రాయితో కొట్టిన బైక్ దొంగ :
ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. వాస్తవానికి అతడు బైక్ దొంగ అనే విషయం కృష్టప్పకు తెలియదు. అంతటితో ఆగకుండా కోపోద్రిక్తుడైన ఖాన్ రాయి తీసుకుని కృష్ణప్ప తలపై దారుణంగా కొట్టి పారిపోయాడు. తీవ్రగాయలతో రక్తపు మడుగులో పడివున్న వృద్ధుడిని అటుగా వెళ్లేవారు గుర్తించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కృష్టప్ప పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

77-Year-Old Bengaluru Man
మృతుడి కుమారుడి అనుమానమే నిజమైంది :
అసలు ఏమి జరిగిందో ఎవరూ చూడలేదు. స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా హిట్ అండ్ రన్‌లో మరణించాడని పోలీసులు భావించి కేసు నమోదు చేశారు. కానీ, తండ్రి కృష్టప్ప మృతిపై కుమారుడు సతీష్‌కు మొదటి నుంచి అనుమానం ఉంది. తన తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని బలంగా నమ్మాడు. అతడి అనుమానమే నిజమైంది. పోలీసులు విచారణలో అసలు నిజాలు బయటకొచ్చాయి. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు దగ్గరలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అది హత్యగా తేలింది. ఆ తర్వాత నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.
డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ శేఖర్ మాట్లాడుతూ.. కృష్ణప్ప విజీ కాలనీలో నివాసిగా గుర్తించినట్టు తెలిపారు. అతను మందులు కొనడానికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగిందని తెలిపారు. మొదట హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీని చెక్ చేయడంలో అది హత్యగా తేలింది. వయాలికావల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. నిందితుడు సర్ఫరాజ్ ఖాన్‌ను అరెస్టు చేయగా తదుపరి విచారణ కొనసాగుతోంది.
Read Also : కారులో రూ.2కోట్లు.. హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్‌లో భారీగా నగదు పట్టివేత