Saif Ali Khan: ఇదెక్కడి ట్విస్ట్‌రా మావా.. సైఫ్‌ ఇంట్లో అటాక్ చేసినోడి ఫింగర్‌ ప్రింట్స్ అక్కడ లేవట

దర్యాప్తు చేపట్టిన పోలీసుల టీమ్‌ సైఫ్‌ ఇంటి వద్ద 19 వేలిముద్రలను సేకరించింది.

Saif Ali Khan: ఇదెక్కడి ట్విస్ట్‌రా మావా.. సైఫ్‌ ఇంట్లో అటాక్ చేసినోడి ఫింగర్‌ ప్రింట్స్ అక్కడ లేవట

Updated On : January 26, 2025 / 4:20 PM IST

సినీనటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి జరిగిన ఘటనలో మరో ట్విస్ట్. ఈ కేసులో నిందితుడు షరీఫుల్ ఇస్లాంను పట్టుకుని బాంద్రా పోలీసులు దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. షరీఫుల్ వేలిముద్రలను సేకరించి, సైఫ్‌పై దాడి జరిగిన ప్రాంతంలో లభించిన వేలిముద్రలను పోల్చిచూశారు.

అయితే, ఆ రెండు రకాల వేలిముద్రలు సరిపోలడం లేదని తెలుస్తోంది. అంటే పోలీసులు పట్టుకున్నది అసలైన నిందితుడిని కాదా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ నెల 16న తెల్లవారుజామున సైఫ్ అలీఖన్‌ ఇంట్లోకి నిందితుడు ప్రవేశించి దాడి చేసిన విషయం విదితమే.

Siraj : సింగ‌ర్‌తో సిరాజ్ డేటింగ్‌? ఆమె ఎవ‌రో తెలుసా? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

దర్యాప్తు చేపట్టిన పోలీసుల టీమ్‌ సైఫ్‌ ఇంటి వద్ద 19 వేలిముద్రలను సేకరించింది. అయితే, ఈ వేలిముద్రల్లో ఒక్కటి కూడా నిందితుడి వేలిముద్రలతో సరిపోలలేదని పోలీసులకు ఫోరెన్సిక్‌ టీమ్‌ తెలిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దీంతో మరిన్ని పరీక్షల కోసం మళ్లీ ఘటనా స్థలం నుంచి ఫింగర్‌ప్రింట్లను సేకరించాలని పోలీసులు అనుకుంటున్నారు. పోలీసులు ఇప్పటికే సైఫ్‌ అలీఖాన్‌ బ్లడ్‌ శాంపిల్స్‌, ఆయనపై నిందితుడు దాడి చేసిన రోజునాటి దుస్తులను సేకరించి ల్యాబ్‌కు పంపించారు.

నిందితుడు షరీఫుల్ బంగ్లాదేశ్ జాతీయుడు. షరీఫుల్ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడు. అతడే సైఫ్‌ అలీఖాన్ ఇంటి వద్ద దోపిడీకి ప్రయత్నించాడు. భారత్‌లో షరీఫుల్‌కి నకిలీ పౌరసత్వం కోసం పత్రాలు సిద్ధం చేసి ఇస్తానని ఓ వ్యక్తి అతడికి చెప్పినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. షరీఫుల్‌కు ఆ పత్రాలను ఇస్తానని చెప్పిన ఆ వ్యక్తి కోసం పోలీసులు ఇప్పుడు గాలిస్తున్నారు.

Yogi Adityanath: ఇలాగైతేనే ఇండియా స్ట్రాంగ్‌ అవుతుంది: యోగి ఆదిత్యనాథ్