Bomb Blast In Chhattisgarh : రాయపూర్ రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుడు….. ఆరుగురు జవాన్లకు గాయాలు

చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ రైల్వే స్టేషన్ లో ఈరోజు ఉదయం జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Bomb Blast In Chhattisgarh : రాయపూర్ రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుడు….. ఆరుగురు జవాన్లకు గాయాలు

Raipur Railway Station Blast

Updated On : October 16, 2021 / 11:53 AM IST

Bomb Blast In Chhattisgarh :  చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ రైల్వే స్టేషన్ లో ఈరోజు ఉదయం జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

శనివారం ఉదయం గం.6-30 సమయంలో  211 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితో   జమ్మూ వెళుతున్న రైలు రెండవ నెంబర్ ప్లాట్ ఫాం పై ఆగి ఉంది.  ఆసమయంలో   గ్రైనేడ్ లు ఉన్న పెట్టెను ఒక బోగి నుంచి మరోక బోగీలోకి తరలిస్తుండగా పొరపాటున చేయిజారి పెట్టె కింద పడింది.

Also Read : Sabarimala Ayyappa Temple : ఈరోజు సాయంత్రం తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం
ఈ క్రమంలో ఆ పెట్టెలోని డిటోనేటర్ పేలి ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు రైల్వే స్టేషన్ కు చేరుకుని ఘటన జరిగిన ప్రదేశాన్ని పరీశీలించి విచారణ జరుపుతున్నారు. మరి కొందరు అధికారులు ఆస్పత్రికి చేరుకుని జవాన్ల ఆరోగ్య పరిస్ధితిని  పర్యవేక్షిస్తున్నారు.