Mother And Daughter Suicide : కుక్క పిల్లను ఇవ్వలేదని తల్లీకూతురు ఆత్మహత్య
బెంగళూరులో విషాదం నెలకొంది. ఇంట్లో ని కుక్క పిల్లను వేరే వారికి ఇవ్వడానికి కుటుంబం నిరాకరించిందని తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు.. ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై దివ్య భర్తపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

mother and daughter suicide
Mother And Daughter Suicide : బెంగళూరులో విషాదం నెలకొంది. ఇంట్లో ని కుక్క పిల్లను వేరే వారికి ఇవ్వడానికి కుటుంబం నిరాకరించిందని తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దివ్య (36) అనే మహిళకు కుక్కలంటే ఎలర్జీ. కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె వైద్యులను సంప్రదించింది. అయితే, ఇది ఎలర్జీ వల్లనే జరిగిందని డాక్టర్లు తేల్చారు.
కుక్కలకు దూరంగా ఉండాలని ఆమెకు సూచించారు. ఈ విషయాన్ని భర్తకు చెప్పిన ఆమె.. ఇంట్లోని కుక్కను వారే వారికెవరికైనా ఇవ్వాలని కోరింది. దీనికి ఆమె అత్తింటి వారు ఒప్పుకోలేదు. దీంతో బాధ పడిన ఆమె.. కూతురు హృద్య (13)తో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.
Crime News: ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక.. రాజమండ్రిలో ఆత్మహత్య చేసుకున్న దంపతులు
కూతురు ఆరో తరగతి చదువుతోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై దివ్య భర్తపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.