Crime News: ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక.. రాజమండ్రిలో ఆత్మహత్య చేసుకున్న దంపతులు

రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. బరితెగించిన ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల వేదింపులు తాళలేక భార్యభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Crime News: ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక.. రాజమండ్రిలో ఆత్మహత్య చేసుకున్న దంపతులు

Online App

Crime News: రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. బరితెగించిన ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల వేదింపులు తాళలేక భార్యభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన దుర్గారావు పదేళ్ల క్రితం ఉపాధి కోసంరాజమండ్రి వచ్చాడు. ఆరేళ్ల క్రితం రమ్యలక్ష్మితో వివాహం అయింది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు నాగ సాయి (4), లిఖిత శ్రీ(2) . దుర్గారావు పెయింటర్. రమ్య లక్ష్మి టైలరింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక రెండు ఆన్‌లైన్ యాప్‌ల నుంచి అప్పుతీసుకున్నాడు.

Crime News: భర్త తలపై వేడినూనె పోసిన భార్య.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

కొంత చెల్లించినప్పటికీ మిగతా అమౌంట్ ఇవ్వకపోతే భార్య నగ్నంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని యాప్ నిర్వాహకులు బెదిరించారు. డబ్బులు చెల్లిస్తామని, కొంత గడువు ఇవ్వాలని  బతిమాలినప్పటికీ యాప్ నిర్వాహకులు కనికరం చూపలేదు.  డబ్బులు చెల్లించాలని యాప్ నిర్వాహకుల నుంచి రోజురోజుకు వేధింపులు పెరిగిపోయాయి. తాజాగా అసభ్యకరంగా ఉన్న భార్య ఫొటోలు వాట్సాప్ గ్రూప్ లలో యాప్ నిర్వాహకులు షేర్ చేశారు. దీంతో తట్టుకోలేక పోయిన ఆ దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధయ్యారు.

Online Loan Apps Harassment : తీసుకుంది రూ.2వేలు, కట్టింది రూ.15వేలు, అయినా న్యూడ్ ఫొటోలతో వేధింపులు.. లోన్ యాప్స్ దారుణాలు

రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ లాడ్జికి వెళ్లి విషంతాగి ఆత్మహత్య కు చేసుకున్నారు. అంతకుముందు మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని, పిల్లలను బాగా చూసుకోవాలని కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి దంపతులు చెప్పారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. అమ్మానాన్న దేవుడి దగ్గరికి వెళ్లారు. పుట్టినరోజు కేకు తీసుకురావడానికి వెళ్లారంటూ చెబుతున్న చిన్నారుల మాటలు విని స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు.