Small Trader Huge Currency Notes : బెంగాల్‌లో సీఐడీకి షాక్..చిరు చేపల వ్యాపారి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు
బెంగాల్‌లో ఓ చేపల వ్యాపారి ఇంట్లో దాడులు చేసిన సీఐడీ అధికారులు షాక్‌కి గురయ్యారు. అతడు ఉంటున్న శిథిలావస్థలోని ఇంట్లో కోట్ల కట్టలు లభ్యం కావడంతో నివ్వెరబోయారు. కౌంటింగ్ మెషిన్ సాయంతో డబ్బులు లెక్కించారు. ఇప్పటి వరకు రూ. కోటి 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Small Trader Huge Currency Notes
Small Trader Huge Currency Notes : బెంగాల్‌లో ఓ చేపల వ్యాపారి ఇంట్లో దాడులు చేసిన సీఐడీ అధికారులు షాక్‌కి గురయ్యారు. అతడు ఉంటున్న శిథిలావస్థలోని ఇంట్లో కోట్ల కట్టలు లభ్యం కావడంతో నివ్వెరబోయారు. కౌంటింగ్ మెషిన్ సాయంతో డబ్బులు లెక్కించారు. ఇప్పటి వరకు రూ. కోటి 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
చిరు వ్యాపారి ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంత మొత్తంలో నగదు ఎక్కడిదనేదానిపై సీఐడీ విచారణ చేపట్టింది. సాదా సీదాగా చేపలు అమ్ముకునే వ్యక్తి దగ్గర భారీ మొత్తంలో నగదు దొరకడంతో.. అతడికి ఇంత మొత్తంలో డబ్బులు ఎలా వచ్చాయన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
IT Raids : మధ్యప్రదేశ్‌లో ఐటీ దాడులు.. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులో దాచిన రూ.8కోట్లు, నగలు సీజ్
జైప్రకాశ్ ఇల్లు చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. ఓ పాతకాలం నాటి చిన్న ఇల్లు… రంగులు వెలసిపోయి పేదరికానికి కేరాఫ్‌లా కనిపిస్తుంది. ఇంట్లో కూడా ఎక్కడా ఖరీదైన ఫర్నిచర్ కనిపించదు. దీంతో ఎవరూ కూడా ఆ ఇంట్లో అంత డబ్బు ఉంటుందని ఊహించలేదు.
పైగా అతను ఓ చిన్న చేపల వ్యాపారి. పేదరికంలో ఉన్నాడని అనుకునేవారు. కానీ ఆ ఇంట్లో ఇప్పుడు బయటపడిన నోట్ల కట్టలు చూస్తే అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఈ స్థాయిలో నగదును ఎలా దాచాడో అనుకుంటున్నారు.