కూకట్ పల్లిలో ఘోరం : చైతన్య వాటర్ ట్యాంకర్ ఢీకొని నారాయణ ఉద్యోగి మృతి

హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. చైతన్య విద్యా సంస్థలకు చెందిన వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ట్యాంకర్.. నారాయణ

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 07:52 AM IST
కూకట్ పల్లిలో ఘోరం : చైతన్య వాటర్ ట్యాంకర్ ఢీకొని నారాయణ ఉద్యోగి మృతి

Updated On : November 27, 2019 / 7:52 AM IST

హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. చైతన్య విద్యా సంస్థలకు చెందిన వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ట్యాంకర్.. నారాయణ

హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. చైతన్య విద్యా సంస్థలకు చెందిన వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ట్యాంకర్.. నారాయణ కాలేజీకి చెందిన ఉద్యోగిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణ కాలేజీ ఉద్యోగి స్పాట్ లోనే చనిపోయాడు. మృతుడిని సయ్యద్ ఖాసింగా గుర్తించారు. కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత్ నగర్ లో ఈ ప్రమాదం జరిగింది.

అయ్యప్ప సొసైటీలో నివాసం ఉండే సయ్యద్ ఖాసిం బుధవారం(నవంబర్ 27,2019) ఉదయం యాక్టివాపై వెళ్తున్నారు. వాటర్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టింది. కిందపడిన ఖాసింపై నుంచి ట్యాంకర్ వెనుక చక్రాలు వెళ్లాయి. తీవ్రగాయాలతో ఖాసిం స్పాట్ లోనే చనిపోయాడు. శరీరం ముక్కలైంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదానికి అతి వేగమే కారణం అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వేగం దూసుకొచ్చిన ట్యాంకర్.. అదుపు తప్పింది. ట్యాంకర్ ని అదుపు చేయలేకపోయిన డ్రైవర్.. ముందు వెళ్తున్న బైక్ ని ఢీకొట్టాడు. కాగా, ఈ ప్రమాదాన్ని ట్యాంకర్ డ్రైవర్ గమనించలేదు. దీంతో మృతదేహాన్ని వంద మీటర్లు ఈడ్చుకెళ్లాడు. స్థానికుల అరుపులు విన్న తర్వాత డ్రైవర్ ట్యాంకర్ ని ఆపాడు.

అప్పటివరకు ఏం జరిగిందో అతడికి తెలియదు. కాగా, ఈ ప్రమాదాన్ని కళ్లారా చూసిన వారు షాక్ తిన్నారు. మృతుడి స్వస్థలం యాదాద్రి జిల్లా. ట్యాంకర్ ను సీజ్ చేసిన పోలీసులు… డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిన్నారు.

అతివేగంతో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వాహనదారులు మాత్రం మేల్కొనడం లేదు. వారిలో మార్పు రావడం లేదు. అతివేగం, నిర్లక్ష్యంతో జనం ప్రాణాలు తీస్తున్నారు. బుధవారం(నవంబర్ 27,2019) ఉదయం ఎల్బీనగర్‌- దిల్‌సుఖ్‌నగర్‌ ప్రధాన రహదారిపై అన్‌లిమిటెడ్‌ మాల్‌ దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. అక్కడితో ఆగలేదు. ఆ వేగంతోనే కారు పల్టీలు కొట్టి…. మెట్రో డివైడర్‌ను ఢీకొట్టి ఆగింది.

కొన్ని రోజుల క్రితం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు ఫ్లైఓవర్ పైనుంచి కింద పడింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్ లోనే చనిపోయారు. కొందరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణం అని విచారణలో తేలింది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా వాహనదారుల్లో మార్పు మాత్రం రావడం లేదు. వేగాన్ని తగ్గించుకోవడం లేదు.