స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం…హత్య

స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం…హత్య

Updated On : March 17, 2021 / 5:58 PM IST

15 ఏళ్ల స్నేహంలో…స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మానుకోమని హెచ్చరించినా పెడచెవిన పెట్టాడు. కసితీరని స్నేహితుడు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ఘట్ కేసర్ సమీపంలోని మన్సూరాబాద్లో నివాసం ఉండే ఆలకుంట యాదగిరి, మదరమోని సైదులు గత 15 ఏళ్లుగా  స్నేహితులు. తరచూ సైదులు యాదగిరి ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు.

ఎప్పడూ సరదాగా నవ్వుతూ నవిస్తూ ఉండే సైదులు తను వేసే జోక్స్ తో  యాదగిరి భార్యకి దగ్గరయ్యాడు.  ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తను ఇంట్లో లేనప్పడు కూడా తన ఇంటికి వచ్చివెళ్లటం గమనించిన యాదగిరి వారి మధ్య అక్రమ సంబంధం ఉందని గుర్తించాడు.  ఇది మంచి పద్ధతి కాదని భార్య, స్నేహితుడిని హెచ్చరించాడు.

అయినా వారిద్దరూ మారలేదు. భర్తకు తెలియకుండా యాదగిరి భార్య సైదులును కలుస్తూనే ఉంది. దీంతో యాదగిరి మే నెలాఖరులో  ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ళలోకి మారిపోయాడు. ఇంటి అడ్రస్ తెలుసుకుని  సైదులు అక్కడికి కూడా రావటం మొదలెట్టాడు. యాదరిగిలో సహనం నశించింది. భార్య తన కళ్లముందే తన స్నేహితుడితో వివాహేతర సంబంధం కొనసాగించటం తట్టుకోలేని యాదగిరి  సైదులును  హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఘట్ కేసర్ మైసమ్మ గుట్ట కాలనీలోని మిత్రులు మహీపాల్, శివకు సైదులుతన భార్యతో పెట్టుకున్న అక్రమ సంబంధం  విషయం చెప్పాడు. సైదులును హతమారిస్తే లక్ష రూపాయలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.  దీంతో ప్లాన్ ప్రకారం అందరూ కల్సి మద్యం తాగుదాం రమ్మని జూన్ 19న సైదులును పిలిచారు. రెండు బైకులపై  నలుగురు స్నేహితులు మైసమ్మగుట్ట దగ్గరకు బయలుదేరారు.  గుట్టపై నలుగురు స్నేహితులు మద్యం సేవించారు.

మిగిలిన వాళ్లు తక్కువ మోతాదులో మద్యం సేవించి ….సైదులుతో కొంచె ఎక్కువ తాగించారు. మద్యం మత్తులో ఉన్నసైదులును కత్తులతో పొడిచి పారిపోయారు.  మైసమ్మ గుట్టపై శవాన్ని గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఘటనా స్ధలంలో లభించిన మద్యం బాటిళ్ల ఆధారంగా  వైన్ షాపును గుర్తించారు. అక్కడ నాలుగు రోజుల నాటి సీసీటీవీ ఫుటేజిని పరిశీలించగా మృతడు మరో ముగ్గురితో కలిసి బైక్ లపై  వచ్చి మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు.  బైక్ నెంబర్లు ఆధారంగా రిజిష్ట్రేషన్ అడ్రస్ కనుక్కున్నారు.  అక్కడి నుంచి ఘట్ కేసర్ , ఆదర్స్ నగర్లలో విచారించి నిందితులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు యాదగిరి ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో వివరంగా  చెప్పటంతో  పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు.

Read: టిక్ టాక్ స్టార్ రౌడీ బేబీ ఆత్మహత్యాయత్నం