Hayath Nagar Chain Snatch : హైదరాబాద్‌లో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు, పట్టపగలే షాపులోకి దూరి..
హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. ఈసారి హయత్ నగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. కిరాణ షాపు నిర్వహిస్తున్న సునీత అనే మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల గోల్డ్ చైన్ తెంపుకుని పారిపోయారు. పక్కా ప్లాన్ ప్రకారమే దొంగలు వచ్చారు.

Hayath Nagar Chain Snatch : హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. ఈసారి హయత్ నగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. పట్టపగలే చైన్ స్నాచర్లు బరితెగించారు. కిరాణ షాపు నిర్వహిస్తున్న సునీత అనే మహిళను టార్గెట్ చేసిన దొంగలు ఆమె మెడలో నుంచి రెండున్నర తులాల గోల్డ్ చైన్ తెంపుకుని పారిపోయారు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
పక్కా ప్లాన్ ప్రకారమే దొంగలు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు. తమ ముఖాలు కనిపించకుండా ఇద్దరూ ముసుగులు ధరించారు. ఓ వ్యక్తి తలకు హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. ముందుగా అతడు షాప్ లోనికి వెళ్లాడు. మరో వ్యక్తి బైక్ దగ్గరే ఉన్నాడు. హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి షాపులోనికి దూరి సునీత మెడలోని చైన్ లాక్కొని వచ్చాడు. ఆ తర్వాత పరిగెత్తాడు. బయటే ఉన్న వ్యక్తి బైక్ ఆన్ చేసి రెడీగా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.
అసలేం జరిగిందో అర్థమయ్యే లోపు చైన్ స్నాచర్లు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బాధితురాలు కాసేపు షాక్ లో ఉండిపోయింది. ఆమె రోడ్డు మీదకు వచ్చి అరిచేలోపే చైన్ స్నాచర్లు పరార్ అయ్యారు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. పట్టపగలే జరిగిన ఈ చైన్ స్నాచింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read..Cheated Aunties, Young Girls : కడప ప్లే బోయ్ … సోషల్ మీడియా ద్వారా 300 మంది మహిళలను…
పట్టపగలే జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మహిళలు రోడ్డు మీదకు రావాలంటే భయపడిపోతున్నారు. చైన్ స్నాచర్లు ఇలా షాపు లోపలికి కూడా దూరి చైన్లు లాక్కెళ్లడం ఆందోళనకు గురి చేస్తోంది. పోలీసులు భద్రత పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. అదను చూసి గొలుసులు తెంపుకెళ్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉన్నా, పటిష్టమైన నిఘా ఉన్నా, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. చైన్ స్నాచర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. కొన్ని రోజులు సైలెంట్ అవుతున్న తెంపుడు గాళ్లు అదను చూసి స్నాచింగ్ కు దిగుతున్నారు. తాజాగా హయత్ నగర్ లో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనతో మరోసారి నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. భయాందోళన చెందుతున్నారు. పోలీసులు నిఘా పెంచాలని, చైన్ స్నాచర్ల ఆట కట్టించాలని డిమాండ్ చేస్తున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
మరోవైపు పోలీసులు కూడా నగరవాసులను హెచ్చరిస్తున్నారు. మెడలో బంగారు గొలుసులు ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తమ మెడ కవర్ అయ్యేలా జాగ్రత్త పడాలంటున్నారు. మరీ ముఖ్యంగా రద్దీ లేని ప్రాంతాల్లో ప్రజలు మరింత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.