Hyderabad Chain Snatching : 2గంటల వ్యవధిలో 6చోట్ల చైన్ స్నాచింగ్.. చైన్ స్నాచర్ల కోసం పోలీసుల వేట

జంట నగరాల్లో వరుస చైన్ స్నాచింగ్ లు కలకలం రేపాయి. నగరవాసులను భయాందోళనకు గురి చేశాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బైక్ లపై నిఘా పెట్టిన పోలీసులు.. స్నాచర్ల ఫొటోల ఆధారంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు.

Hyderabad Chain Snatching : 2గంటల వ్యవధిలో 6చోట్ల చైన్ స్నాచింగ్.. చైన్ స్నాచర్ల కోసం పోలీసుల వేట

Hyderabad Chain Snatching : జంట నగరాల్లో వరుస చైన్ స్నాచింగ్ లు కలకలం రేపాయి. నగరవాసులను భయాందోళనకు గురి చేశాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బైక్ లపై నిఘా పెట్టిన పోలీసులు.. స్నాచర్ల ఫొటోల ఆధారంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు.

ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా మళ్లీ విరుచుకుపడ్డారు. గొలుసులు తెంచుకెళ్లారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, పటిష్టమైన నిఘా, సిటీ పోలీసుల కఠిన చర్యలతో హైదరాబాద్ అంటేనే హడలెత్తిన ముఠాలు ఏడాది తర్వాత మరోమారు రెచ్చిపోయాయి. చైన్ స్నాచర్ గ్యాంగ్ లు మళ్లీ సిటీపై కన్నేశాయి. నగరవాసులు ఉలిక్కిపడేలా చైన్ స్నాచర్లు బరితెగించారు. రెండు గంటల వ్యవధిలోనే 6 చోట్ల మహిళల మెడల నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు చైన్ స్నాచర్లు.

Also Read..Women Dies After Eating Biryani : బాబోయ్.. బిర్యానీ తిని యువతి మృతి, వారం రోజుల్లో రెండో ఘటన, విచారణకు మంత్రి ఆదేశం

ఉప్పల్‌ పరిధిలోని రాజధాని థియేటర్ ప్రాంతంతో పాటు కల్యాణ్‌పురి, నాచారంలోని నాగేంద్రనగర్‌, హబ్సిగూడలోని రవీంద్రనగర్‌, చిలకలగూడలోని రామాలయం గుండు, రాంగోపాల్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. ఉదయం ఉప్పల్‌లో మొదలు పెట్టి సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌ వరకు వరుసగా 6 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు.

చోరీ చేసిన బైక్ పై వచ్చి ఉప్పల్ చౌరస్తాకు సమీపంలో మొదట ఓ మహిళ మెడ నుంచి గొలుసు తెంచుకెళ్లిన ఇద్దరు దుండగులు.. కల్యాణ్ పరి కాలనీలో వృద్ధురాలి మెడ నుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. హబ్సిగూడ రవీంద్రనగర్ లో జానకమ్మ అనే వృద్ధురాలు ఇంటి ముందు పూలు తెంపుతుండగా.. పల్సర్ బైక్ పై వచ్చి అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ అదను చూసి గొలుసు తెంచుకుని ఉడాయించారు.

Also Read..Amberpate Inspector Cheating : ఎన్ఆర్ఐకి భూమి ఇప్పిస్తానని మోసం.. అంబర్ పేట ఇన్ స్పెక్టర్ పై కేసు నమోదు

ఇక నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాగేంద్రనగర్‌లో విమల అనే వృద్ధురాలు తన ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు పువ్వులు కావాలంటూ వచ్చి.. ఆమె మెడలోని 5 తులాల బంగారం గొలుసును లాక్కెళ్లారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ కృష్ణానగర్ కాలనీలో జ్యోతిబెన్ అనే మహిళ 8గంటల సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వెంబడించిన దుండగులు.. ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల గొలుసును లాక్కెళ్లారు.

చోరీలు చేశాక చైన్ స్నాచర్లు బైక్ ను ప్యారడైజ్ దగ్గర వదిలి వెళ్లిపోయారు. అప్పటికే బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు..ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. గొలుసులు తెంచుకెళ్లింది ఢిల్లీ ముఠా అనే అనుమానంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రైల్వేస్టేషన్ పై దృష్టి పెట్టారు పోలీసులు. రైల్వే స్టేషన్ తో పాటు పలు ప్రాంతాల్లోనూ వాహన తనిఖీలు నిర్వహించారు. సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా గొలుసు దొంగల ముఠా కోసం గాలింపును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే కాచిగూడ నుంచి వరంగల్ వెళ్లే రైల్లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

స్నాచర్స్ రెచ్చిపోవడంతో హైదరాబాద్ లో నిఘాను పటిష్టం చేశారు పోలీసులు. స్నాచర్స్ కోసం ప్రత్యేక టీమ్స్ ను రంగంలోకి దింపారు. బంగారు ఆభరణాలు ధరించినప్పుడు మహిళలు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు.