నిందితులకు సరైన శిక్ష పడింది : నన్నపనేని  రాజకుమారి

  • Published By: chvmurthy ,Published On : December 6, 2019 / 02:54 AM IST
నిందితులకు సరైన శిక్ష పడింది : నన్నపనేని  రాజకుమారి

Updated On : December 6, 2019 / 2:54 AM IST

దిశ హత్యాచారం ఘటన నిందితుల ఎన్ కౌంటర్ ను హర్షిస్తున్నానని ఏపీ మహిళా కమీషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. దిశ ఘటన జరిగిన 10 రోజుల నుంచి దేశంలో ఎక్కడోచోట ఏదో ఒకచోట  మహిళలపై అత్యాచారం జరుగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  తల్లితండ్రులు తమ బిడ్డలను కాపాడుకోలేక   పరిస్ధితి సమాజంలో ఉందని ఆమె అన్నారు. 

ఆత్మరక్షణ కోసం,మాన రక్షణకోసం,స్వీయరక్షణ కోసం మనిషి  ఎదురుతిరగటంలో తప్పులేదని ఆమె చెప్పారు. చట్టాల్లో లొసుగుల వల్ల, బెయిల్ రావటం వల్ల, నిందితులు తప్పించుకు తిరుగుతున్నారని ఎన్ కౌంటర్ ను హర్షిస్తున్నానని ఆమె అన్నారు. దిశను హత్యాచారం చేసిన నిందితులు సమాజంలో బతికి ఉండకూడదని ప్రతి ఒక్కరూ కోరుకున్నారని..నేడు అదే జరిగిందని ఆమె అన్నారు.   

ఏతల్లితండ్రులు కూడా ఇలాంటి కొడుకులు ఉండకూడదని కోరుకుంటున్నారు. దేవుడనే వాడు ఉన్నాడు ..ఎప్పుడో ఒకసారి పాపం పండుతుందని ఆమె  వ్యాఖ్యానించారు. బార్ అసోసియేషన్లుకూడా ఇలాంటి కేసులు వాదించకుండా తీర్మానాలు చేయాలని కోరారు. నేటి వరకు నిర్భయ కేసు, ఉన్నవ్ కేసులో శిక్షలు పడకపోవటం విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.