కోటి రూపాయల కట్నం కోసం భార్యను హింసించి, ఇంట్లోంచి గెంటేసిన ఐఆర్ఎస్ అధికారి

కోటి రూపాయల కట్నం కోసం భార్యను హింసించి, ఇంట్లోంచి గెంటేసిన ఐఆర్ఎస్ అధికారి

Updated On : June 21, 2021 / 1:25 PM IST

కోటి రూపాయల కట్నం, ఇన్నోవా కారు, బంగారు ఆభరణాలు కట్నం కింద తేవాలని డిమాండ్ చేస్తూ ఒక ఐఆర్ఎస్ అధికారి..బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న తన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో ఈదారుణం జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అహమ్మదాబాద్ మహిళా రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అహమ్మదాబాద్ లో ఒక జాతీయ బ్యాంకులో మేనేజర్ గా పని చేసే ప్రేరణ(34) కు( పేరు మార్చబడింది) 2013 లో రాహుల్( పేరు మార్చబడింది) అనే ఐఆర్ఎస్ అధికారితో వివాహం జరిగింది. వారు అహ్మదాబాద్ శివారు లోని ఒక విలాస వంతమైన గేటెడ్ కమ్యునిటీ లో నివాసం ఉంటున్నారు. వివాహానికి ముందు రాహుల్ కుటుంబ సభ్యలు కట్నం లాంఛనాలు మరికొన్ని కోరికలు కోరారు.

ప్రేరణ కుటుంబ సభ్యులు కట్నం ఇవ్వటానికి నిరాకరించారు. అయినా సరే రాహుల్ కుటుంబ సభ్యులు సంబంధం నచ్చి వివాహాం జరిపించారు. పెళ్లై అత్తవారింటికి వచ్చిన కొన్నాళ్ల నుంచి ప్రేరణకు వరకట్న వేధింపులు ఎక్కవయ్యాయి. మా అబ్బాయికి మార్కెట్ లో కోటి రూపాయలు కట్నం వస్తుంది. పోయి పోయి బిచ్చగాడి కూతురుని చేసుకున్నామని సూటి పోటి మాటలతో ఆమెను బాధించసాగారు. వారి మాటలు పట్టించుకోకుండా ప్రేరణ ఏమీ మాట్లాడకుండా కాపురం చేసుకోసాగింది.

కోడలు నుంచి ఎటువంటి సమాధానం రాకపోయే సరికి … కట్నం తీసుకురాకపోతే పుట్టింటికి పంపిస్తామని బెదిరించ సాగారు. అయినా ప్రేరణ పట్టించుకోక పోవటంతో భర్త, అత్తమామలు ఆమె పై భౌతిక దాడి చేయటం మొదలెట్టారు. ఇన్ని వేధింపుల మధ్య ప్రేరణ ఒక బాబుకు జన్మనిచ్చింది. ఆ బాలుడి వయస్సు ఇప్పుడు 5 ఏళ్లు.

2015 లో రాహుల్ కు అహ్మదాబాద్ ట్రాన్సఫర్ అయ్యింది. 2016లో కట్నం తేలేదని ఆమెను ఇంటినుంచి బయటకు గెంటేశారు. దాంతో ఆమె పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ వారిద్దరూ కలిసి కాపురం చేసేలా చేశారు. అనంతరం ఇద్దరూ విడాకుల కోసం అప్లై చేసారు. ఏమైందో ఏమో రాహుల్ డైవర్సీ పిటీషన్ ను ఉపసంహరంప చేశాడు.

మళ్లీ కొన్నాళ్లు రాహుల్ బాగానే ఉన్నాడు కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆమెను శారీరకంగా హంసించటంమొదలెట్టాడు. శరీరంలో చెప్పుకోలేని ప్రాంతాలలో కొడుతూ ఆమెను హింసించసాగాడు. భర్త హింస, వేధింపులను తట్టుకోలేని ప్రేరణ మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Here>>పైశాచికానందం…కిడ్నాప్, ప్రయివేట్ భాగాలపై శానిటైజర్