అనంతలో డిగ్రీ విద్యార్థిని శిరీష హత్య కేసులో వీడిన మిస్టరీ.. హంతకుడు వాడే..!

ఈ నెల 7వ తేదీన వడ్డుపల్లి వద్దకు రావాలని శిరీషతో చెప్పాడు.

అనంతలో డిగ్రీ విద్యార్థిని శిరీష హత్య కేసులో వీడిన మిస్టరీ.. హంతకుడు వాడే..!

Sireesha Case (Photo Credit : Google)

Updated On : September 10, 2024 / 8:29 PM IST

Degree Student Case : అనంతపురంలో సంచలనం రేపిన డిగ్రీ కళాశాల విద్యార్థిని హత్య కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ నెల 7న ఆత్మకూరు మండలం వడ్డుపల్లి వద్ద విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని గుమ్మగట్ట మండలం సిరిగే దొడ్డి గ్రామానికి చెందిన శిరీషగా గుర్తించారు. తనను పెళ్లి చేసుకోలేదని శిరీషను తిప్పేస్వామి అలియాస్ పండు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

శిరీష అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. పెళ్లి చేసుకోవాలని గత కొన్ని రోజులుగా శిరీషను తిప్పేస్వామి వేధిస్తున్నాడు. శిరీష మరొకరితో చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన వడ్డుపల్లి వద్దకు రావాలని శిరీషతో చెప్పాడు తిప్పేస్వామి. అక్కడ కొడవలితో శిరీషను నరికి చంపాడు తిప్పేస్వామి. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి వేట కొడవలి స్వాధీనం చేసుకున్నారు. బైక్ ను సీజ్ చేశారు.

Also Read : కందుకూరు జ్యువెలరీ షాపులో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు