Khammam Constable Suicide : ఖమ్మంలో విషాదం.. కొన్ని గంటల్లో నిశ్చితార్ధం.. కానిస్టేబుల్ ఆత్మహత్య !
ఈరోజు నిశ్చితార్ధం జరుపుకుని...త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన ఏఆర్ కానిస్టేబుల్ పాడె ఎక్కి స్మశానానికి చేరిన విషాద ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.

Khammam Constable Suicide
Khammam Constable Suicide : ఈరోజు నిశ్చితార్ధం జరుపుకుని…త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన ఏఆర్ కానిస్టేబుల్ పాడె ఎక్కి స్మశానానికి చేరిన విషాద ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. సత్తుపల్లి నియోజక వర్గంలోని యజ్ఞనారాయణపురం గ్రామానికి చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి 2020 లో ఖమ్మం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు.
తరువాత కొత్తగూడెం స్పెషల్ పార్టీ టీంలో పని చేశాడు. పోలీసు శాఖలో బదిలీల్లో భాగంగా ఇటీవల ములుగు జిల్లాకు బదిలీ అయ్యాడు. ఈ రోజు అతని పెళ్లి నిశ్చితార్ధం స్వగ్రామంలో జరగాల్సి ఉంది.
కాగా… ఈనెల 8న ఖమ్మం వచ్చిన అశోక్ కుమార్ ఓ లాడ్జిలో రూమ్ తీసుకుని బస చేశాడు. ఈరోజు ఉదయం రూమ్ క్లీనింగ్ కోసం వచ్చిన సిబ్బంది అశోక్ కుమార్ బస చేసిన రూం తలుపు కొట్టారు. ఎంతసేపు తలుపు కొట్టినా తీయకపోవటంతో వారు మేనేజర్ కు చెప్పారు. మేనేజర్ పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు వచ్చిరూం తలుపులు పగల గొట్టి చూడగా అశోక్ కుమార్ ఉరివేసుకుని చనిపోయి విగతజీవిగా కనిపించాడు.
Also Read : Bandi Sanjay : ప్రధానిని అప్రతిష్టపాలు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం పన్నిన కుట్ర-బండి సంజయ్
పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.పెళ్లి పీటలు ఎక్కాల్సిన అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.