మద్యంమత్తులో మాల తెంచి అయ్యప్ప భక్తులపై దాడి చేసిన ఆర్మీజవాన్లు
తిరుపతిలో అర్ధరాత్రి శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఆర్మీజవాన్లు అయ్యప్ప భక్తులతో దురుసుగా ప్రవర్తించారు. అయ్యప్ప మాల తెంచి అయ్యప్ప భక్తులపై దాడి చేశాడు ఓ జవాన్.

తిరుపతిలో అర్ధరాత్రి శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఆర్మీజవాన్లు అయ్యప్ప భక్తులతో దురుసుగా ప్రవర్తించారు. అయ్యప్ప మాల తెంచి అయ్యప్ప భక్తులపై దాడి చేశాడు ఓ జవాన్.
తిరుపతిలో అర్ధరాత్రి శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఆర్మీజవాన్లు అయ్యప్ప భక్తులతో దురుసుగా ప్రవర్తించారు. అయ్యప్ప మాల తెంచి అయ్యప్ప భక్తులపై దాడి చేశాడు ఓ జవాన్. అయితే ఆ సమయంలో జవాన్లు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. రైలు బోగిలోని టాయిలెట్‌లో మద్యం బాటిళ్లు కూడా దొరికాయి.
తమపై దాడి చేసిన జవాన్లపై అయ్యప్ప భక్తులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరు జవాన్లను అరెస్ట్ చేశారు. జవాన్లు అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పడంతో పోలీసులు ఇద్దరు జవాన్లను మందలించి వదిలిపెట్టారు. ఆర్మీ జవాన్లు శ్రీకాకుళం జిల్లా వాసులుగా గుర్తించారు.