సమత హత్యాచారం : నిందితుల తరపున వాదించేందుకు వకల్తా తీసుకున్న లాయర్

  • Published By: madhu ,Published On : December 18, 2019 / 06:41 AM IST
సమత హత్యాచారం : నిందితుల తరపున వాదించేందుకు వకల్తా తీసుకున్న లాయర్

Updated On : December 18, 2019 / 6:41 AM IST

ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసు విచారణ జరుగుతోంది. ఇప్పటికే దీనిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైన సంగతి తెలిసిందే. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం కోర్టు విచారణ జరిపి..డిసెంబర్ 19వ తేదీ గురువారానికి వాయిదా వేసింది. నిందితుల తరపున వాదించేందుకు న్యాయవాది రహీం వకల్తా తీసుకున్నాడు. కానీ..నిందితుల తరపున వాదించేందుకు లాయర్లు ఎవరూ ముందుకు రాలేదన్న సంగతి తెలిసిందే.

ఎవరూ కూడా వాదించవద్దని ఆదిలాబాద్ జిల్లా బార్ అసోయేషన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. షేక్ బాబు (ఏ1), షాబుద్దీన్ (ఎ2), మఖ్దూం (ఏ3)లు నిందితులు. జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జీషీట్‌ను కొమరం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి దాఖలు చేశారు. 44 మంది సాక్షులతో 150 పేజీల ఛార్జీషీట్ ఉంది.

 

2019, నవంబర్ 27వ తేదీన దిశపై నలుగురు నిందితులు హత్యాచారం జరపడం.. సీన్ రీ కన్ స్ట్రక్షన్‌లో భాగంగా షాద్ నగర్‌కు 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున నిందితులను తీసుకెళ్లడం..పోలీసులపై దాడి చేసి పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పులు నలుగురు నిందితులు చనిపోయారు. 
దీంతో ఒక్కసారిగా ఇతర హత్యాచార కేసుల్లోనూ నిందితులను కాల్చి చంపాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఒంటరిగా ఉన్న చిరు వ్యాపారం చేసుకొనే సమతను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి..చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు. 
అఘాయిత్యం చేసిన తర్వాత..మహిళను హత్య చేసి మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. 
 

ఈ ఘటన 2019, నవంబర్ 24వ తేదీగా జరిగినట్లు భావిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
ఖానాపూర్ మండలం గోసంపల్లికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. 
ఎల్లాపటార్ గ్రామానికి చెందిన షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దూంలుగా గుర్తించారు. 
దళిత మహిళపై హత్యాచారానికి పాల్పడిన వారిని కూడా ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్ ఉధృతమైంది. 
ఎల్లపటార్, జైనూర్, సిర్పూర్, లింగాపూర్ గ్రామ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఆందోళనలు.నిరసనలకు దిగారు.
Read More : చటాన్‌పల్లిలో మరోసారి కలకలం : నాలుగేళ్ల బాలిక కిడ్నాప్