మహిళను బట్టలూడదీసి చావగొట్టిన పోలీసులు

ఓ మహిళను లాకప్ లో పెట్టి బట్టలూడదీసి బెల్టుతో చావగొట్టారు పోలీసులు. హర్యానాలోని గురుగ్రామ్ లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ఫేజ్ 1 పోలీసు స్టేషన్ పరిధిలో అసోంకు చెందిన 30 ఏళ్ల మహిళ ఓ ఇంట్లో పనిమనిషిగా పని చేస్తోంది. అయితే ఆ ఇంట్లో దొంగతనం జరిగిందని.. పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేసిన ఇంటి యజమాని పోలీసులకు కంప్లెయింట్ చేశాడు. దీంతో పనిమనిషిని పోలీసు స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. ఆ తర్వాత ఆమెను లాకప్ రూమ్‌లో బంధించింది ASI మధుబాల. పనిమనిషి బట్టలు విప్పించి బెల్టులు, బ్యాటన్‌లతో విచక్షణారహితంగా చితకబాదింది.
దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని ఆమెను పోలీసులు బలవంతం చేశారు. దానికి ఆమె అంగీకరించకపోవడంతో ప్రైవేటు భాగాల్లో కూడా దారుణంగా కొట్టారు. దీంతో పనిమనిషి, ఆమె భర్త కలిసి గురుగ్రామ్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసు కమిషనర్ విచారణకు ఆదేశించారు. పనిమనిషిని చితకబాదిన ఎస్‌హెచ్‌వో సవైట్ కుమార్, ఏఎస్‌ఐ మధుబాల, హెచ్‌సీ అనిల్ కుమార్, మహిళా కానిస్టేబుల్ కవితపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు పోలీస్ కమిషనర్.