కిడ్నాప్ చేయబోయారు : పీవీపీపై పోలీసులకు బండ్ల గణేశ్ ఫిర్యాదు

సినీ నిర్మాతలు బండ్ల గణేశ్, పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తన ఇంటిపై బండ్ల గణేశ్‌ దాడి

  • Published By: veegamteam ,Published On : October 5, 2019 / 05:34 AM IST
కిడ్నాప్ చేయబోయారు : పీవీపీపై పోలీసులకు బండ్ల గణేశ్ ఫిర్యాదు

Updated On : October 5, 2019 / 5:34 AM IST

సినీ నిర్మాతలు బండ్ల గణేశ్, పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తన ఇంటిపై బండ్ల గణేశ్‌ దాడి

సినీ నిర్మాతలు బండ్ల గణేశ్, పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తన ఇంటిపై బండ్ల గణేశ్‌ దాడి చేశారని, తనను బెదిరించారని పీవీపీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు విషయంలో బండ్ల గణేశ్ మోసం చేశారని ఆరోపించారు. డబ్బు ఇవ్వాలని అడిగినందుకు అనుచరులతో కలిసి తన ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో తెలిపారు. బండ్ల గణేశ్ పై పీవీపీ హత్యాయత్నం కేసు పెట్టారు.

అటు బండ్ల గణేశ్‌ కూడా పీవీపీ పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బుల విషయంలో పీవీపీ మోసం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని కంప్లైంట్ లో తెలిపారు. పీవీపీ తనను కిడ్నాప్ చేయబోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పీవీపీ మనుషులు తరుచుగా తన ఆఫీస్ కి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. కాగా, బండ్ల గణేశ్ ఫిర్యాదుని పోలీసులు లీగల్ ఒపీనియన్ కోసం పంపారు.

టెంపర్ సినిమా విషయంలో ఆర్థిక వ్యవహారాలే ఇద్దరి మధ్య వివాదానికి కారణంగా తెలుస్తోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా టెంపర్ సినిమా తీశారు బండ్ల గణేష్. ఆ సినిమాకు పొట్లూరి వరప్రసాద్ రూ.7 కోట్లు ఫైనాన్స్ చేశారు. ఏళ్లు గడుస్తున్నా తనకు ఇవ్వాల్సిన రూ.7 కోట్లను బండ్ల గణేశ్ ఇవ్వడం లేదని పీవీపీ చెబుతున్నారు. తనకు ఇవ్వాల్సిన సొమ్ము గురించి కొంత కాలంగా పీవీపీ ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో బండ్ల గణేశ్ అనుచరులు తనను బెదిరించారని పీవీపీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు బండ్ల గణేశ్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో బండ్ల గణేశ్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బండ్ల గణేశ్ చేసిన బెదిరింపుల ఆరోపణలను పీవీపీ ఖండించారు. తాను 20 ఏళ్లుగా ఒకే ఫోన్ వాడుతున్నానని, కావాలంటే అందులో కాల్ లాగ్ చూడాలని పీవీపీ అన్నారు. తన ఆఫీస్ సిబ్బంది సీసీ ఫుటేజీ చూడాలన్నారు. తన సిబ్బంది ఎక్కడికైనా వెళ్లారా, ఎవరితోనైనా మాట్లాడారా అనేది చెక్ చేసుకోవాలన్నారు. ఇంటికి వచ్చి మరీ బెదిరించడం దారుణం అన్నారు. దీన్ని తేలిగ్గా తీసుకోవడం లేదన్నారు.