ఆ యువతి నన్ను వేధించింది..! జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్..

ఆ లేడీ కొరియోగ్రాఫర్ కి నాకు షూటింగ్ స్పాట్స్ లో పరిచయం ఏర్పడింది.

ఆ యువతి నన్ను వేధించింది..! జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్..

Updated On : October 13, 2024 / 1:10 AM IST

Jani Master Case : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందంటూ సమీర్ అనే యువకుడు ఆరోపించాడు. జానీ మాస్టర్ లాంటి వ్యక్తినే జైలుకి పంపిన లేడీ కొరియోగ్రాఫర్ తనను ఏమైనా చేస్తుందనే భయంతోనే ఇన్ని రోజులు బయటకు రాలేదని సమీర్ అంటున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తనకు న్యాయం జరక్కపోతే కోర్టును ఆశ్రయిస్తానని సమీర్ తెలిపాడు.

ఆ లేడీ కొరియోగ్రాఫర్ కి నాకు షూటింగ్ స్పాట్స్ లో పరిచయం ఏర్పడింది. 2021 జూలై 2న చెన్నైలోని హోటల్ లో ఆ యువతి, నేను కలిశాం. అలా కలిసినప్పుడు ఆ అమ్మాయి నన్ను రూమ్ లోకి పిలిచింది. చాలా వేధించింది. ఇంకా చాలానే జరిగాయి. జానీ మాస్టర్ తల్లి నాకు అత్త అవుతుంది.

ఈ రోజు ఆ అమ్మాయి మా కుటుంబాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చింది అంటే.. జానీ మాస్టర్ తల్లి ఆసుపత్రిలో చావుతో పోరాడుతోంది. 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేము అని డాక్టర్లు అంటున్నారు. ఆ అమ్మాయి మా కుటుంబాన్ని అలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది. నన్ను మాత్రమే కాదు చాలా మంది అబ్బాయిలో ఆ యువతి ఇలానే ప్రవర్తించింది” అని సమీర్ ఆరోపించాడు.

”నేను త్రీ టౌన్ లో కేసు పెట్టి 24 గంటలు అవుతున్నా ఇంతవరకు నాకు ఎలాంటి సమాచారం లేదు. ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు. అమ్మాయిలకు మాత్రమే చట్టాలు ఉన్నాయా? అబ్బాయిలకు న్యాయం, ధర్మం లేవా? పోలీసులు ఇంతవరకు సమాచారం ఇవ్వలేదు. ఆ అమ్మాయి నోటి మాటతోనే కేసు పెట్టారు. ఆ అమ్మాయి నాతో రూమ్ లో తీసుకున్న ఫోటోలు నా దగ్గరున్నాయి. ఆ అమ్మాయి ఏ సమాచారం ఇవ్వకుండానే కేసు పెట్టింది. నేను ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం లేదు? పోలీసులు ఇలానే చేస్తే.. నేను న్యాయపోరాటం చేస్తాను.

నేను శుక్రవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశాను. ఇంతవరకు నాకు పోలీసుల నుంచి ఫోన్ రాలేదు. ఆ అమ్మాయి ఏం చేస్తుందో అనే భయంతోనే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నా. ఇవాళ జానీ మాస్టర్ తల్లికి ఈ పరిస్థితి వచ్చింది. రేపు మా అమ్మకు ఈ పరిస్థితి రాకూడదనే మీడియాను అప్రోచ్ అవకుండా నేరుగా త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాను. మూడేళ్ల నుంచి ఆ లేడీ కొరియోగ్రాఫర్ నన్ను లైంగికంగా వేధిస్తోంది.

నేను మైనర్ గా ఉన్నప్పుడు నన్ను వేధించింది. పోక్సో చట్టం ఒక అమ్మాయికేనా? అబ్బాయిలకు లేదా? నా ఫొటోలు తన దగ్గర పెట్టుకుని నన్ను వేధిస్తోంది. ఆ ఫోటోలను డిలీట్ చేయించి నాకు న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ స్టేషన్ కు వెళితే ఇంతవరకు స్పందన లేదు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని మీ మామకు చెబుతాను అని బెదిరిస్తోంది. జానీ మాస్టర్ అంత పెద్ద వ్యక్తిని ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇక నేనెంత? నేను అమ్మాయిని.. నేను చెబితే ఎవరైనా నమ్ముతారు అని మూడేళ్ల పాటు నన్ను లైంగికంగా వేధించింది. బ్లాక్ మెయిల్ చేసింది” అని సమీర్ తెలిపాడు.

Also Read : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు..