వీడు మామూలోడు కాదు.. 25రోజులుగా అమ్మాయిలను.. అఖిల్ పహిల్వాన్ అరెస్ట్ కేసులో కొత్త కోణాలు

25 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారితో రోజుకి 20 నుంచి 30 కాల్స్ మాట్లాడుతున్నట్లు తేల్చారు. 16 మంది వెస్ట్ బెంగాల్ అమ్మాయిలతో ఓ హోటల్ లో 25 రోజులుగా...

వీడు మామూలోడు కాదు.. 25రోజులుగా అమ్మాయిలను.. అఖిల్ పహిల్వాన్ అరెస్ట్ కేసులో కొత్త కోణాలు

Big Twist In Ramnagar Akhil Pahilwan Case

Updated On : January 20, 2024 / 6:19 PM IST

Akhil Pahilwan Case : హైదరాబాద్ రాంనగర్ అఖిల్ పహిల్వాన్ వ్యభిచార అరెస్ట్ కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. అఖిల్ పాత ట్రాక్ రికార్డ్ బయటికి తీసిన పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. అఖిలేష్ మొబైల్ ఫోన్ లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచార ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నాయని గుర్తించిన పోలీసులు.. వారితో రోజుకి 20 నుంచి 30 కాల్స్ మాట్లాడుతున్నట్లు తేల్చారు. 16 మంది వెస్ట్ బెంగాల్ అమ్మాయిలతో ఓ హోటల్ లో 25 రోజులుగా అఖిల్ వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

నిన్న రాత్రి అబిడ్స్ లోని ఓ హోటల్ లో హైటెక్ వ్యవభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. తనిఖీలు చేపట్టారు. రాంనగర్ అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అఖిల్ ను అరెస్ట్ చేశారు. అలాగే 16మంది అమ్మాయిలు, నలుగురు విటులు, ఇద్దరు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు. 25 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Also Read : వీధుల్లో దారుణం.. వందలాది మంది ఒకేసారి వచ్చి దోచుకుపోతే ఇలా ఉంటుంది..

అఖిల్ పహిల్వాన్.. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్ లో పెట్టినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. ఓ హోటల్ లో 25 రూముల్లో 16 రూములను వ్యభిచారం కోసం అఖిల్ ఉపయోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా, సినీ ప్రముఖులకు కూడా అమ్మాయిలను సప్లయ్ చేస్తున్నట్లు అఖిల్ పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బ్యాచిలర్ హోటల్ లో పోలీసులు నిన్న వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. ఆ ముఠాను నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు అఖిలేష్ కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. అతడి ఫోన్ ఆధారంగా హైదరాబాద్ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా సభ్యులతో కూడా అఖిలేష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తరచుగా రోజుకు 20 నుంచి 30 కాల్స్ ముఠా సభ్యులతో అతడు మాట్లాడినట్లు తెలిసింది. అఖిలేష్ గడిచిన కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని ఆశ చూపి బెంగాల్ యువతులను హైదరాబాద్ తీసుకొచ్చి హోటల్ లో ఉంచి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన అమ్మాయిలతోనే కాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారితో కూడా అఖిలేష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దర్యాఫ్తును పోలీసులు ముమ్మరం చేశారు.