బీజేపీ జిల్లా అధ్యక్షుడి కొడుకు మృతి కేసు : ఆ బాధతోనే లండన్ బీచ్ లో ఆత్మహత్య

12 రోజుల క్రితం లండన్‌లో అదృశ్యమైన ఖమ్మం విద్యార్థి సన్నె శ్రీహర్ష మిస్సింగ్‌ విషాదాంతంగా మారింది. లండన్‌ బీచ్‌లో శ్రీహర్ష మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శ్రీహర్ష తండ్రి

  • Published By: veegamteam ,Published On : September 3, 2019 / 08:15 AM IST
బీజేపీ జిల్లా అధ్యక్షుడి కొడుకు మృతి కేసు : ఆ బాధతోనే లండన్ బీచ్ లో ఆత్మహత్య

Updated On : May 28, 2020 / 3:44 PM IST

12 రోజుల క్రితం లండన్‌లో అదృశ్యమైన ఖమ్మం విద్యార్థి సన్నె శ్రీహర్ష మిస్సింగ్‌ విషాదాంతంగా మారింది. లండన్‌ బీచ్‌లో శ్రీహర్ష మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శ్రీహర్ష తండ్రి

12 రోజుల క్రితం లండన్‌లో అదృశ్యమైన ఖమ్మం విద్యార్థి సన్నె శ్రీహర్ష మిస్సింగ్‌ విషాదాంతంగా మారింది. లండన్‌ బీచ్‌లో శ్రీహర్ష మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శ్రీహర్ష తండ్రి ఉదయ్‌ ప్రతాప్‌ ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. శ్రీహర్ష ఇకలేడన్న సమాచారంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీహర్షం ఆగస్టు 21న లండన్‌లో బీచ్‌కి వెళ్లాడు. అప్పటి నుంచి అతనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు శ్రీహర్ష కోసం తల్లడిల్లిపోయారు.  

శ్రీహర్ష నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అతని తల్లిదండ్రులు లండన్‌లోని స్నేహితులను సంప్రదించారు. దీంతో వారు లండన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బీచ్‌ పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్లతో ముమ్మరంగా గాలించారు. లండన్‌ బీచ్‌ దగ్గర శ్రీహర్ష సెల్‌ ఫోన్‌, బ్యాగ్‌, ల్యాప్‌టాప్‌ గుర్తించారు. వాటి ఆధారంగా శ్రీహర్ష అదృశ్యమైనట్టు నిర్ధారించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో శ్రీహర్ష తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. 12 రోజుల పాటు గాలించిన లండన్‌ పోలీసులు.. బీచ్‌లో అదృశ్యమైన శ్రీహర్ష మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు. దీంతో శ్రీహర్ష తల్లిదండ్రలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.  

శ్రీహర్ష మెరిట్‌ విద్యార్థి. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదివాడు. ఎంఎస్‌ చదివేందుకు లండన్‌ వెళ్లాడు. ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో ఫస్టియర్ చేశాడు. మెషీన్‌ లెర్నింగ్‌, డాటా ఎనలిటిక్స్‌ స్పెషలైజేషన్‌ చేశాడు. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోని రిషి వ్యాలీ స్కూల్ లో పాఠశాల విద్య పూర్తి చేశాడు. శ్రీహర్ష ఇటీవల జపాన్‌లో ప్రాజెక్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడు. శాస్త్రవేత్త కావాలన్న కోరిక నెరవేరకముందే శ్రీహర్ష చనిపోవడంతో కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు.

శ్రీహర్ష ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై శ్రీహర్ష ఇటీవల చేసిన ప్రాజెక్ట్‌ వర్క్ కాలేజీ అధ్యాపక బృందం తిరస్కరించినట్టు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన శ్రీహర్ష బీచ్‌లో సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. శ్రీహర్ష మృతదేహానికి సెప్టెంబర్ 6న పోస్టుమార్టం నిర్వహించనున్నారు. శ్రీహర్ష ఆత్మహత్య కేసులో లండన్‌లో అతడు చదివిన కాలేజీ అధ్యాపకులతోపాటు తోటి విద్యార్థులను లండన్‌ పోలీసులు విచారిస్తున్నారు.

Also Read : ఏటీఎం ధ్వంసం.. డబ్బులు దొంగిలించిన దుండగులు