రాజేంద్రనగర్ లో భారీ పేలుడు : ఫుట్ పాత్ పై బాక్స్ ఓపెన్ చేయగానే
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో భారీ పేలుడు కలకలం సృష్టించింది. ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తి ఓ బాక్స్‌ను తెరవగానే అది పేలింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. అతడి రెండు

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో భారీ పేలుడు కలకలం సృష్టించింది. ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తి ఓ బాక్స్‌ను తెరవగానే అది పేలింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. అతడి రెండు
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో భారీ పేలుడు కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పై ఉన్న బాక్స్‌ను తెరవగానే అది పేలింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. అతడి రెండు చేతులు తెగిపోయాయి. రాజేంద్రనగర్.. పీవీ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 279 దగ్గర ఈ పేలుడు సంభవించింది. బాక్స్ తెరవగానే భారీ శబ్దంతో పేలింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి రెండు చేతులు తెగి 10 మీటర్ల దూరంలో పడ్డాయి. బాధితుడిని బిచ్చగాడిగా అనుమానిస్తున్నారు పోలీసులు.
రోడ్డుపై, చెత్త కుప్పల్లో సేకరించిన వస్తువులను తన బ్యాగులో వేసుకుని అక్కడ కూర్చుంటాడు. ఇదే క్రమంలో ఫుట్ పాత్ పై కనిపించిన బాక్స్ ఓపెన్ చేయగా అది పేలినట్టు పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్.. ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.
అతనికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపట్టారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అసలు ఆ బాక్స్ అక్కడికి ఎలా వచ్చింది? అందులో ఏముంది? భారీ పేలుడికి కారణం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.