అయ్యో : అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి బాలుడి మృతి
కరీంనగర్ లో విషాదం జరిగింది. అపార్ట్ మెంట్ పై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన లక్ష్మీ, గోపాల్

కరీంనగర్ లో విషాదం జరిగింది. అపార్ట్ మెంట్ పై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన లక్ష్మీ, గోపాల్
కరీంనగర్ లో విషాదం జరిగింది. అపార్ట్ మెంట్ పై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన లక్ష్మీ, గోపాల్ దంపతులకు హర్షవర్ధన్ రెడ్డి(12), కుమార్తె ఉన్నారు. కరీంనగర్ లో టిఫిన్ సెంటర్ నిర్వహించే గోపాల్ కొన్ని రోజుల కిందట వరకు మంకమ్మతోటలోని అపార్ట్ మెంట్ లో నివాసం ఉన్నాడు. ఇటీవలే ఇల్లు మారాడు. ఇల్లు మారినా అలవాటు ప్రకారం హర్షవర్ధన్ రెడ్డి అపార్ట్ మెంట్ పైకి వెళ్లి ఆడుకునేవాడు. మంగళవారం (ఏప్రిల్ 23,2019) కూడా అలానే ఆడుకోవడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో హర్ష తల పూలకుండీకి తగిలింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. కుమారుడు మృతి చెందిన విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు. పిల్లలను అలా ఒంటరిగా వదిలేయకూడదని పోలీసులు సూచించారు. అపార్ట్ మెంట్లపైకి వెళ్లినప్పుడు కచ్చితంగా ఎవరో ఒకరు తోడుగా ఉండాలని, వారిని గమనిస్తూ ఉండాలని పేరెంట్స్ కి చెప్పారు.